Rithu Chowdary: తిరిగిరావా.. నాన్న!

ABN , First Publish Date - 2023-01-24T15:56:11+05:30 IST

సీరియల్‌ నటి, జబర్దస్త్‌ కామెడీ షో ఫేం గాయత్రి అలియాస్‌ రీతూ చౌదరి ఇంట విషాదం నెలకొంది. ఆమె తండ్రి గుండెపోటుతో మరణించారు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆమె ఈ విషయాన్ని తెలిపారు. తనకు తండ్రి అంటే ఎంత ఇష్టమో ఎన్నో సందర్భాల్లో తెలిపారు రీతూ.

Rithu Chowdary: తిరిగిరావా.. నాన్న!

సీరియల్‌ నటి, జబర్దస్త్‌ కామెడీ షో ఫేం గాయత్రి అలియాస్‌ రీతూ చౌదరి (Rithu chowdary) ఇంట విషాదం నెలకొంది. ఆమె తండ్రి Rithu chowdary father is nomore) గుండెపోటుతో మరణించారు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆమె ఈ విషయాన్ని తెలిపారు. తనకు తండ్రి అంటే ఎంత ఇష్టమో ఎన్నో సందర్భాల్లో తెలిపారు రీతూ. తాజాగా తండ్రి మరణంపై సోషల్‌ మీడియాలో ఫొటో, భావోద్వేగ ఓ పోస్ట్‌ పెట్టారు. ‘‘ఐ మిస్‌ యూ నాన్న. నన్ను వదిలేసి ఎలా వెళ్లిపోయావు. నువ్వు లేకుండా నేను ఉండలేను. నీ కూతురి దగ్గరికి తిరిగిరావా.. ఈ ఫొటో తీసుకున్నప్పుడు తెలియదు.. దీన్ని ఇలా పోస్ట్‌ చేయాల్సి వస్తుందని’’ అంటూ తన తండ్రితో దిగిన చివరి ఫొటోను షేర్‌ చేసింది. ఈ విషయం తెలిసిన తోటి నటులు, జబర్దస్త్‌ కమెడియన్లు విచారం వ్యక్తం చేశారు. టీవీ యాంకర్‌గా కెరీర్‌ మొదలు పెట్టిన రీతూ సీరియళ్లలోనూ నటిస్తున్నారు.

2.jpg

Updated Date - 2023-01-24T15:56:12+05:30 IST