#Khushi: పవన్ కళ్యాణ్ పాత సినిమా రికార్డు బ్రేక్ కలెక్షన్స్

ABN , First Publish Date - 2023-01-03T14:38:34+05:30 IST

20 ఏళ్లకు పైబడిన పవన్ కళ్యాణ్ సినిమా 'ఖుషీ' (Pawan Kalyan #Khushi) ఇప్పుడు మళ్ళీ విడుదల చేసారు. ఆ సినిమా కలక్షన్స్ చూస్తుంటే అందరూ షాక్ అవుతున్నారు.

#Khushi: పవన్ కళ్యాణ్ పాత సినిమా రికార్డు బ్రేక్ కలెక్షన్స్

ఇప్పుడు విడుదల అవుతున్న సినిమాలు ఏవైనా రెండు రోజులు వరసగా థియేటర్స్ హౌస్ ఫుల్స్ అయితే చాలు, అందరూ పండగలా చేసుకుంటున్నారు. కానీ 20 ఏళ్లకు పైబడిన పవన్ కళ్యాణ్ సినిమా 'ఖుషీ' (Pawan Kalyan #Khushi) ఇప్పుడు మళ్ళీ విడుదల చేసారు. ఆ సినిమా కలక్షన్స్ చూస్తుంటే అందరూ షాక్ అవుతున్నారు. ఇప్పుడు విడుదల అయినా సినిమాల కన్నా ధాటిగా, ఎక్కువ కలెక్షన్స్ రాబడుతూ పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో బాక్స్ ఆఫీస్ దగ్గర చూపిస్తోంది ఈ సినిమా. (Record break collections of #Khushi) భూమిక (Bhumika Chawla) ఇందులో కథానాయికగా నటించింది.

khushi3.jpg

మూడు రోజులకి గాను మొత్తం 6.58 కోట్ల (Rs 6.58 crore collected in just three days) రూపాయలు కలెక్టు చేసి 'ఖుషీ' ఆల్ టైం రికార్డు సృష్టించింది. (All time record of #Khushi) ఇప్పుడు ఇలా విడుదల అయిన పథ సినిమాల రికార్డ్స్ చూస్తే పవన్ కళ్యాణ్ సినిమాలే మొదటి రెండు స్థానాల్లో వున్నాయి. 'ఖుషి' మొదటి స్థానం ఆక్రమించగా, రెండో స్థానం లో 'జల్సా' (Jalsa) వుంది. ఈ రెండు సినిమాలు పవన్ కళ్యాణ్ కి చెందినవే అవటం విశేషం కాగా, మూడో స్థానం లో మహేష్ బాబు (Mahesh Babu) నటించిన 'పోకిరి' (#Pokiri) వుంది. ఇలా పాత సినిమాలే ఇంతంత కలెక్షన్స్ రాబట్టడం, సినిమా థియేటర్స్ వాళ్ళకి కూడా ఒక లాభమే. (Pawan Kalyan films #Khushi and #Jalsa are the top two films and Mahesh Babu #Pokiri is in third place) థియేటర్స్ లో మంచి సినిమాలు లేక, డల్ గా వున్న మూమెంట్ లో ఇలా పాత సినిమాలు విడుదల అయి క్రేజీ గా కలెక్షన్స్ రాబడుతుంటే, ఇదే పద్దతిలో ఇంకా చాలా ఎక్కువ సినిమా సినిమాలు మళ్ళీ విడుదల చేసే అవకాశాలు వున్నాయి.

Updated Date - 2023-01-03T14:38:52+05:30 IST