Ee Nagaraniki Emayindi: స్టార్స్ సినిమాలతో సమానంగా షాకింగ్ కలెక్షన్స్

ABN , First Publish Date - 2023-06-29T15:35:55+05:30 IST

'ఈ నగరానికి ఏమైంది' రెండో సారి విడుదలై ప్రభంజనం సృష్టిస్తోంది. కలెక్షన్ల సునామీ కురిపిస్తోంది. నిర్మాత సురేష్ బాబు కి ఈ సినిమా మొదటి సారి విడుదల కన్నా రెండోసారి బాగా డబ్బులొస్తున్నాయి అన్న ఆనందంలో వున్నారు. దర్శకుడు తరుణ్ భాస్కర్ అయితే, ఈ కలెక్షన్స్ మొదటి సారి విడుదల అయినప్పుడు ఉంటే గోవాలో ఇల్లు కట్టుకొని సెటిల్ అయిపోయేవాడిని అని అన్నాడట స్నేహితులతో. అంటే ఎంత కలెక్షన్స్ చేస్తోందో చూడండి మరి...

Ee Nagaraniki Emayindi: స్టార్స్ సినిమాలతో సమానంగా షాకింగ్ కలెక్షన్స్
Still from Ee Nagaraniki Emaindi

ఈమధ్య చాలామంది అగ్ర నటుల సినిమాలు రెండో సారి విడుదల అవుతున్నాయి. అందులో కొన్ని సినిమాలు బాగా నడిచాయి, కొన్నిటిని ప్రేక్షకులు పట్టించుకోలేదు. అగ్ర నటుల సినిమాలే కాకుండా చిన్న సినిమా అయిన 'ఈ నగరానికి ఏమైంది' #EeNagaranikiEmaindi అయిదు సంవత్సరాలు పూర్తి అయినా సందర్భంగా ఈరోజు విడుదల అయింది. దర్శకుడు తరుణ్ భాస్కర్ (TharunBhascker) తన మొదటి సినిమా 'పెళ్లి చూపులు' #PelliChoopulu తరువాత చేసిన సినిమా ఇది. దగ్గుబాటి సురేష్ బాబు (DaggubatiSureshBabu) దీనికి నిర్మాత. #ENE

ఈ చిన్న సినిమా, నిఖిల్ సిద్ధార్థ (NikhilSiddhartha) నటించిన 'స్పై' #SpyMovie సినిమా, అలాగే శ్రీ విష్ణు (SreeVishnu) నటించిన 'సామజవరగమనా' #Samajavaragamana సినిమాలతో విడుదల అయింది. ప్రభాస్ (Prabhas), కృతి సనన్ (KritiSanon) నటించిన 'ఆదిపురుష్' #Adipurush ఇంకా కొన్ని థియేటర్స్ లో ఉండటం, ఈ రెండు కొత్త సినిమాలు విడుదల, ఈ సమయంలో 'ఈ నగరానికి ఏమైంది'#EeNagaranikiEmaindi అనే చిన్న సినిమాని ఎవరైనా చూస్తారా అని ఆ చిత్ర నిర్వాహకులు అనుకున్నారు. ముందు అందుకే హైదరాబాద్ లో శాంతి థియేటర్ #ShantiTheater లో విడుదల చెయ్యాలని అనుకున్నారు. ఆలా పెట్టగానే అయిదు నిముషాల్లో హౌస్ ఫుల్ అయిపొయింది. అది చూసిన వెంటనే నిర్మాత సురేష్ బాబు ఇంకో రెండు థియేటర్స్ లో కూడా విడుదల చేద్దాం అని అనుకున్నారు. అవి కూడా పెట్టిన కొన్ని నిముషాలకే హౌస్ ఫుల్ అయిపొయింది.

eenagaraniki1.jpg

అదేంటి ఈ సినిమాకి ఇంత క్రేజ్ ఉందా అని అప్పుడు ఎక్కడ కాళీ థియేటర్స్ ఉన్నాయా అని వెతకటం మొదలెట్టారు. నెల్లూరు, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ ఇలా ఒకటేమిటి ఎక్కడ ఓపెన్ చేసినా వెంట వెంటనే టికెట్స్ బుక్ అయిపోవటం మొదలైంది. ఇంక ఆ సినిమాకి క్రేజ్ ఎంత ఉందొ అర్థం అయి మొత్తం మార్నింగ్ షో 210 థియేటర్స్ లో విడుదల చేశారు. హైదరాబాద్ లాంటి పట్టణాల్లో మార్నింగ్ 8.45 నిముషాలకి కూడా షో వేశారు అంటే ఆ సినిమాకి ఎంత డిమాండ్ వుందో తెలుస్తోంది.

ఇక మార్నింగ్ షో కలెక్షన్స్ చూస్తే షాకవుతారు. ఒక్క మార్నింగ్ షో కి ఈ సినిమా అక్షరాలా ఒక కోటి రూపాయలు కలెక్టు చేసింది. నిర్మాత సురేష్ బాబు, దర్శకుడు తరుణ్ భాస్కర్ ల ఆనందానికి అంతే లేదు. ఆసక్తికరం ఏంటంటే ఈ సినిమా మొదటి సారి విడుదల అయినప్పుడు కూడా ఇంత కలెక్షన్స్ రాలేదు. అప్పుడు కేవలం రూ. 20 లక్షలు మాత్రమే చేసింది. ఇప్పుడు ఒక కోటి రూపాయలు అంటే మాటలా. ఒక విధంగా చెప్పాలంటే 'ఈ నగరానికి ఏమైంది' #EeNagaranikiEmaindi సినిమా, విడుదల అయిన రెండు సినిమాలు అంటే 'సామజవర గమనా', 'స్పై' రెవెన్యూకి దెబ్బ తీసిందని చెప్పాలి. ఇలా మొదటి సారి విడుదల కన్నా, రెండో సారి విడుదల అయినప్పుడు ఎక్కువ రెవిన్యూ కలెక్టు చేసిన సినిమా ఏదైనా ఉందట అది 'ఈ నగరానికి ఏమైంది' #EeNagaranikiEmaindi ఒక్కటే, ఒక చిన్న సినిమా పెద్ద రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నట్టే కదా!.

ఈ రెవిన్యూ చూసి దర్శకుడు తరుణ్ భాస్కర్ #TharunBhascker తన స్నేహితులతో మాట్లాడుతూ, "మొదటిసారి విడుదల అయినప్పుడు ఇలాంటి కలెక్షన్స్ వస్తే నేను గోవాలో (Goa) ఇల్లు కట్టుకొని సెటిల్ అయిపోయేవాడిని" అని జోక్ గా అన్నాడట. కానీ అందులో నిజమే వుంది కదా!

Updated Date - 2023-06-29T15:35:55+05:30 IST