Netflix Ceo: టాలీవుడ్‌ రౌండప్‌.. కారణం అదేనా?

ABN , First Publish Date - 2023-12-09T21:44:46+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందుతూ ఓటీటీ రంగంలో అగ్రస్థానంలో ఉన్న ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌ కో - సీఈవో టెడ్‌ సరాండొస్‌  మూడు రోజులుగా హైదరాబాద్‌లో పర్యటిస్తున్న సంగతి  తెలిసిందే. హైదరాబాద్‌లో దిగిన ఆయన మొదట చిరంజీవి ఇంటికి వెళ్లారు.

Netflix Ceo: టాలీవుడ్‌ రౌండప్‌.. కారణం అదేనా?


ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందుతూ ఓటీటీ రంగంలో అగ్రస్థానంలో ఉన్న ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌ కో - సీఈవో టెడ్‌ సరాండొస్‌  మూడు రోజులుగా హైదరాబాద్‌లో పర్యటిస్తున్న సంగతి  తెలిసిందే. హైదరాబాద్‌లో దిగిన ఆయన మొదట చిరంజీవి ఇంటికి వెళ్లారు. అక్కడ రామ్‌చరణ్‌, శోభుయార్లగడ్డ, విక్కీలతో భేటీ అయ్యారు. అంతేకాదు టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు వెంకటేశ్ , మహేశ్  , ప్రభాస్‌, అల్లు అర్జున్ , ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌, రానా, నాగచైతన్య, సాయిధరమ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌, దుల్కర్‌, దర్శకులు త్రివిక్రమ్‌, రాజమౌళి, సుకుమార్‌, కొరటాల శివ, నాగ అశ్విన్, నిర్మాతలు డి.సురేశ్ బాబు, ప్రియాంక దత్ , స్వప్నా దత్   తదితరులను ఆయా సినిమా సెట్స్‌లో కలిసి సందడి చేశారు. వారితో కాసేపు ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నారు.
Netflix (1).jpgNetflix (3).jpgNetflix (2).jpg

అయితే టాలీవుడ్‌లో రెండ్రోజులుగా ఇదే చర్చ నడుస్తోంది. ఉన్నట్టుండి నెట్‌ఫ్లిక్స్‌ సీఈఓ టాలీవుడ్‌ ప్రముఖులను కలవడం వెనకున్న కథ ఏంటి? అని చర్చలు మొదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయి పెరిగిన నేపథ్యంలో టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు, దర్శకనిర్మాతలతో నెట్‌ఫ్లిక్స్‌ ఏమైనా ప్రాజెక్ట్‌లు ప్లాన చేసిందా? లేదంటే నిర్మాణ భాగస్వామ్యం ప్లాన చేశారా అన్న కోణంలో టాక్‌ వినిపిస్తోంది. 

Netflix (4).jpgNetflix (5).jpgNetflix (6).jpg

Updated Date - 2023-12-09T21:45:57+05:30 IST