Biggboss 7 : ఎలిమినేషన్.. కారణం ఏంటంటే!

ABN , First Publish Date - 2023-11-13T11:11:27+05:30 IST

బిగ్‌బాస్‌ సీజన్ 7 మొదలై అప్పుడే 70 రోజులు పూర్తయింది. పదోవారం ఎలిమినేషన్ ఆదివారం జరిగింది. పాట బిడ్డగా హౌస్‌లో అడుగుపెట్టిన గాయకులు, సంగీత దర్శకుడు భోలె షావలి ఈ వారం ఇంటి నుంచి ఎలిమినేట్‌ అయ్యారు. అయితే అతని ఎలిమినేషన్ షాకింగ్‌గా ఉందని నెటిజన్లు చెబుతున్నారు.

Biggboss 7 : ఎలిమినేషన్..  కారణం ఏంటంటే!

బిగ్‌బాస్‌ సీజన్ 7 (biggboss7) మొదలై అప్పుడే 70 రోజులు పూర్తయింది. పదోవారం ఎలిమినేషన్ ఆదివారం జరిగింది. పాట బిడ్డగా హౌస్‌లో అడుగుపెట్టిన గాయకులు, సంగీత దర్శకుడు భోలె షావలి (Bhole shavali) ఈ వారం ఇంటి నుంచి ఎలిమినేట్‌ అయ్యారు. అయితే అతని ఎలిమినేషన్ షాకింగ్‌గా ఉందని నెటిజన్లు చెబుతున్నారు. ఈ వారం నామినేషన్స్‌లో భోలె షావలి, గౌతమ్‌ కృష్ణ, శివాజీ, ప్రిన్స్‌ యావర్‌, రతిక ఉండగా, అతి తక్కువ ఓట్లు వచ్చిన భోలె ఎలిమినేట్‌ అయినట్లు నాగార్జున ప్రకటించారు. భోలె షావలి మొదటి మూడు వారాలు ఎలిమినేట్‌ అయిన వారి స్థానంలో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా అడుగుపెట్టారు. పాట బిడ్డ ట్యాగ్‌తో ఎంట్రీ ఇచ్చిన ఆయన రోజుకో రకంగా ఆడ ఆడేవాడు. ఇంట్లో ఉన్నన్ని రోజులు అందరితో మంచిగా ఉండాలనుకుంటున్నాని చెప్పాడు.

పాట బిడ్డ ట్యాగ్‌ విషయంలో రైతుబిడ్డని, అందరితో సరదాగా ఉండాలనుకుంటున్నాను అన్న విషయంలో శివాజీని కాపీ కొట్టినట్లు వీక్షకులు భావిస్తున్నారు. గేమ్‌ ఆడటం, నామినేషన్స్ సమయంలో అతని మాట తీరు, బిహేవియర్‌ డిఫరెంట్‌గా ఉండేది. ఎదుటివారు ఏదైన ప్రశ్న అడిగితే స్ట్రెయిట్ గా జవాబు ఇవ్వకుండా ఏదో పాట పాడుతూ, అర్థం లేకుండా మాట్లాడుతూ అందరికీ ఇరిటేట్‌ చేసేవాడు. వచ్చిన కొద్ది రోజులకే శివాజీతో కలిసిపోవడంతో సీరియల్‌ టీమ్‌కి యాంటీ అయ్యాడు. దాంతో వాళ్లు ఇతన్ని టార్గెట్‌ చేయడం మొదలుపెట్టారు. ఓటింగ్‌ తక్కువ ఉండడంతో భోలె బయటికొచ్చాడు. (bhole shavali Eliminated)

Updated Date - 2023-11-13T11:11:28+05:30 IST