Pushpa 2 : పుష్పరాజ్‌ విల్లానా.. లేక?

ABN , First Publish Date - 2023-09-08T16:47:52+05:30 IST

‘పుష్ప-2’ సినిమా నుంచి లీక్‌ రూపంలో మంచి అప్‌డేట్‌ వచ్చింది. నేషనల్‌ క్రష్‌ రష్మిక ఈ లీక్‌ ఇచ్చారు. ‘పుష్ప-2’ షూటింగ్‌ నుంచి ఓ ఆసక్తికర ఫొటోను షేర్‌ చేశారు. ఇప్పటి దాకా ‘పుష్ప-’ చిత్రంలో లారీల ఫొటో నెట్టింట హల్‌చల్‌ చేయగా ఇప్పుడు రష్మిక పోస్ట్‌ చేసిన ఫొటో మరింత ట్రెండ్‌ అవుతోంది.

Pushpa 2 : పుష్పరాజ్‌ విల్లానా.. లేక?

‘పుష్ప-2’(Pushpa2) సినిమా నుంచి లీక్‌ రూపంలో మంచి అప్‌డేట్‌ వచ్చింది. నేషనల్‌ క్రష్‌ రష్మిక (Rashmika ) ఈ లీక్‌ ఇచ్చారు. ‘పుష్ప-2’ షూటింగ్‌ నుంచి ఓ ఆసక్తికర ఫొటోను షేర్‌ చేశారు. ఇప్పటి దాకా ‘పుష్ప-’ చిత్రంలో లారీల ఫొటో నెట్టింట హల్‌చల్‌ చేయగా ఇప్పుడు రష్మిక పోస్ట్‌ చేసిన ఫొటో మరింత ట్రెండ్‌ అవుతోంది. ఇంతకీ ఆ ఫొటో ఏంటంటే.. పుష్ప సినిమాకు సంబంధించిన సెట్‌ అది. అందులో అందమైన భవంతిని చూపించా. ఆ హౌస్‌ చాలా గ్రాండియర్‌గా ఉంది. అయితే ఆ ఫొటను చూసిన నెటిజన్లు ‘అది పుష్ప విల్లానా.. లేక కార్యాలయమా? అని కామెంట్‌ చేస్తున్నారు. ఈ సెట్‌ ఫొటోను రష్మిక ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. అదే ఫొటోను మైత్రీ మూవీ మేకర్స్‌ అఫీషియల్‌ ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసి, ‘పుష్ప 2’ సెట్స్‌ అంటూ అని రాసుకొచ్చారు. రష్మిక ఎగ్జైట్‌మెంట్‌తో ఈ ఫొటోను అభిమానులతో షేర్‌ చేసుకున్నారు’’ అని ట్వీట్‌లో పాల్గొన్నారు.

Rashmika.jpg

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu arjun) హీరోగా నటించిన ‘పుష్ప’ చిత్రం ఏ రేంజ్‌లో హిట్‌ అయిందో తెలిసిందే! ఈ చిత్రంతో బన్నీ, రష్మిక పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందారు. అంతే కాదు.. ఈ చిత్రంలో నటనకు గానూ అల్లు అర్జున్‌ నేషనల్‌ అవార్డ్‌ దక్కింది. 91 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఏ హీరో సాధించని ఘనతను బన్నీ సాధించారు. ఇవన్నీ దృష్టింలో పెట్టుకుని దర్శకుడు సుకుమార్‌ రెండో పార్ట్‌ను అంతకుమించి అన్నట్లు తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

Updated Date - 2023-09-08T16:49:52+05:30 IST