RashmikaMandanna: ఐశ్వర్య రాజేష్ శ్రీవల్లి కామెంట్ పోస్ట్ కి రిప్లై ఇచ్చిన రష్మిక

ABN , First Publish Date - 2023-05-19T13:21:16+05:30 IST

'పుష్ప' సినిమాలో శ్రీవల్లి పాత్ర గురించి ఐశ్వర్య రాజేష్ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. అయితే నేను ఆలా అనలేదు అని ఐశ్వర్య తరువాత వివరణ ఇచ్చింది. ఆ వివరణకు రష్మిక మందన్న ఏమని సమాధానం చెప్పిందంటే...

RashmikaMandanna: ఐశ్వర్య రాజేష్ శ్రీవల్లి కామెంట్ పోస్ట్ కి రిప్లై ఇచ్చిన రష్మిక
Rashmika Mandanna and Aishwarya Rajesh

ఐశ్వర్య రాజేష్ (AishwaryaRajesh) మంచి నటి, తమిళంలో విమెన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఆమె చేసే సినిమాలు అన్నీ వైవిధ్యంగానే ఉంటాయి. అందుకే ఆమె అగ్రస్థానంలో వెలుగుతోంది అక్కడ. ఆసక్తికర సమాసం ఏంటంటే ఆమె తెలుగు అమ్మాయి అయినా తెలుగు సినిమాలు మాత్రం చాలా తక్కువ చేసింది. ఈమధ్య ఆమె 'ఫర్హానా' #Farhana సినిమా తెలుగు, తమిళం లో విడుదల అయింది. తెలుగు సినిమా ప్రచారాలకు వచ్చినప్పుడు ఆమె చెప్పిన ఒక సమాధానం ఒక వివాదానికి దారితీసింది. ఆమె సమాధానం రష్మిక మందన్న నటించిన (RashmikaMandanna) 'పుష్ప' #Pushpa సినిమాలో ఆమె పాత్ర శ్రీవల్లి #Srivalli గురించి. "ఆ శ్రీవల్లి పాత్ర నేను చేస్తే ఇంకా బాగా చేసేదానిని" అని ఐశ్వర్య అన్నట్టుగా వార్తలు వైరల్ అయ్యాయి.

aishwaryarajesh.jpg

దాని మీద ఐశ్వర్య రాజేష్ వివరణ ఇచ్చింది. "మీకు తెలుగులో ఎటువంటి పాత్రలు అంటే ఇష్టం అని ప్రాస అడిగినప్పుడు, నేను దానికి టాలీవుడ్ అంటే ఎంతో ఇష్టం అని చెప్పను. అలాగే 'పుష్ప' సినిమాలో శ్రీవల్లి లాంటి పాత్రలు చెయ్యాలని వుంది అని చెప్పాను. అటువంటి పాత్రలు నాకు బాగా సూట్ అవుతాయని చెప్పాను. అంతేకానీ అది నేను చేస్తే ఇంకా బాగా చేస్తాను అని అనలేదు. రష్మిక చాలా బాగా చేసింది ఆ పాత్రలో. నా సమాధానాన్ని తప్పుగా అర్థం చేసుకొని రష్మిక నటనను నేను కించపరిచేటట్టు రాసారు. నేను ఆలా అనలేదు, అదీ కాకుండా నా తోటి నటీనటులు అంటే నాకెంతో గౌరవం, వాళ్ళని ఎందుకు కించపరుస్తాను. ఇప్పటికైనా ఇలాంటి వ్యాఖ్యలు రాయటం మానుకోవాలి," అని వివరణ ఇచ్చింది.

Rashmika-2.jpg

అయితే ఆమె వివరణ చూసిన రష్మిక మందన్న కూడా స్పందించింది. "మీరు వివరణ ఇవ్వలన్సిన పనిలేదు. ఎందుకంటే మీరు ఏమి చెప్పారో నేను పర్ఫెక్ట్ గా అర్థం చేసుకున్నాను. అందుకని మీరు ఇలా వివరణ ఇవ్వాల్సిన పని లేదు. నాకు మీ మీద ప్రేమ, గౌరవం ఎప్పుడూ ఉంటాయి. మీ 'ఫర్హానా' సినిమాకి అల్ ది బెస్ట్" అని రష్మిక రిప్లై చెప్పింది. ఈ ఇద్దరూ ఇలా ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు, మరి వాళ్ళ మధ్యలో ఎటువంటి మనస్పర్థలు లేవు, ఇంకా ఈ వివాదం ఇక్కడితో ఆగిపోతుంది అని భావిస్తున్నాం అని నెటిజన్స్ అంటున్నారు.

Updated Date - 2023-05-19T13:21:16+05:30 IST