కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rashmika Mandanna: గర్ల్‌ ఫ్రెండ్‌ ఉంటే కిక్కేవేరప్ప..

ABN, First Publish Date - 2023-10-22T13:26:47+05:30

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రధాన పాత్రలో గీతా ఆర్ట్స్‌, మాస్‌ మూవీ మేకర్స్‌, ధీరజ్‌ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ (The Girl Friend). చి.ల.సౌ, మన్మథుడు 2 చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుతున్న రాహుల్‌ రవీంద్రన్‌ ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రధాన పాత్రలో గీతా ఆర్ట్స్‌, మాస్‌ మూవీ మేకర్స్‌, ధీరజ్‌ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ (The Girl Friend). చి.ల.సౌ, మన్మథుడు 2 చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుతున్న రాహుల్‌ రవీంద్రన్‌ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. విద్య కొప్పినేని, ధీరజ్‌ మొగిలినేని నిర్మాతలు. ఆదివారం ఈ చిత్రానికి సంబఽందించిన ప్రకటన విడుదల చేశారు. ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ సినిమా అనౌన్స్‌ మెంట్‌ సందర్భంగా రిలీజ్‌ చేసిన టైటిల్‌ పోస్టర్‌, మోషన్‌ పోస్టర్‌ ఆసక్తికరంగా ఉన్నాయి.

‘నాదీ అని చెప్పుకోవడానికి ఒక గర్ల్‌ ఫ్రెండ్‌ ఉంటే ఆ కిక్కే వేరురా...’ అంటూ మోషన్‌ పోస్టర్‌ వాయిస్‌ ఓవర్‌లో వచ్చిన డైలాగ్స్‌, రష్మిక శ్వాసను ఆపి నీటిలో కూర్చుని ఉండటం.. సినిమా మీద ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేస్తున్నాయి. ది గర్ల్‌ ఫ్రెండ్‌ సినిమా ప్రేక్షకులకు ఒక కొత్త సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుందని చిత్ర బృందం చెబుతోంది. త్వరలో ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభం కానుంది.

Updated Date - 2023-10-22T16:02:12+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!