Rashmika Mandanna: ఈరోజు ప్రారంభం అయిన 'రైన్ బో' సినిమా కథ ఇదే !

ABN , First Publish Date - 2023-04-03T12:12:53+05:30 IST

రష్మిక మందన్న ఇప్పుడు చాలా పాపులర్ అయిపొయింది. ఆమెతో 'రైన్ బో' అనే ఫిమేల్ సెంట్రిక్ సినిమా నిర్మాత ఎస్.ఆర్. ప్రభు ఈరోజు ప్రారంభించాడు. శాంతరూబన్ దీనికి దర్శకుడు. ఈ సినిమా నేపధ్యం ఏంటి అంటే...

Rashmika Mandanna: ఈరోజు ప్రారంభం అయిన 'రైన్ బో' సినిమా కథ ఇదే !
Rashmika Mandanna

రష్మిక మందన్న (Rashmika Mandanna) సినిమా 'రైన్ బో' (Rainbow) ఈరోజు హైదరాబాద్ లో అధికారికంగా ప్రారంభం అయింది. ఎస్.ఆర్. ప్రభు (SR Prabhu) ఈ సినిమాకి నిర్మాత కాగా ఈ సినిమా తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం లో దర్శకుడు, నిర్మాత, ఇందులో నటిస్తున్న రష్మిక సినిమా కథ గురించి కానీ, నేపథ్యం గురించి కానీ ఎటువంటి క్లూ ఇవ్వలేదు. సినిమా విడుదల అయ్యాక తెలుస్తుంది అని చెప్పారు.

rashmikamandanna3.jpg

కానీ దర్శకుడిని శాంతరూబన్ (Shantharuban) అడిగినప్పుడు సినిమా లోగో చూస్తే మీకే అర్థం అవుతుంది అని చెప్పాడు. అప్పుడు ఇది ఫాంటసీ కథేనా అని అడిగితే 'అవును' అని చెప్పాడు. అలాగే ఇది టైమ్ ట్రావెల్ కి సంబందించిన కథ అని కూడా తెలిసింది. సూపర్ నేచురల్ ఉండకపోవచ్చు కానీ, ఫాంటసీ వుంది అని చెప్పాడు దర్శకుడు. 'రైన్ బో' టైటిల్ పెట్టడానికి కూడా కారణం అదే అని అర్థం అవుతోంది అని తెలిసింది.

rashmikamandanna2.jpg

రష్మిక మందన్న, 'శాకుంతలం' (Shakuntalam) సినిమా లో దుష్యంతుడు గా వేసిన దేవ్ మోహన్ (Dev Mohan) ఈ 'రైన్ బో' సినిమాలో కథానాయకుడు. ఇందులో రష్మిక డ్యూయల్ రోల్ లో కనిపించవచ్చు అని కూడా అంటున్నారు. అయితే ఇది ఫిమేల్ సెంట్రిక్ మూవీ అయినా, తాను అన్ని రకాల సినిమాలు చేస్తాను అని చెప్పింది రష్మిక. ఇలా ఒక్క ఫిమేల్ సెంట్రిక్ సినిమాలే కాకుండా, లీడ్ యాక్ట్రెస్ గా వచ్చిన సినిమాలు, తన అభిమానులకు నచ్చేవి, తనకి నచ్చేవి అన్ని సినిమాలు చేస్తాను అని చెప్పింది రష్మిక.

Updated Date - 2023-04-03T12:12:55+05:30 IST