Rashmika Mandanna: రష్మిక మాటలు భలే ముద్దుగా ఉన్నాయ్‌..!

ABN , First Publish Date - 2023-07-11T12:46:18+05:30 IST

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నాకు సోషల్‌ మీడియాలో ఉన్న ఫాలోయింగ్‌ గురించి తెలిసిందే! తనకు సమయం దొరికిన ప్రతిసారీ నెట్టింట అభిమానులతో మాట్లాడుతుంటారు. తాజాగా ఆమె అభిమానులతో ముచ్చటించారు. ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Rashmika Mandanna: రష్మిక మాటలు భలే ముద్దుగా ఉన్నాయ్‌..!

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా(Rashmika Mandanna) కు సోషల్‌ మీడియాలో ఉన్న ఫాలోయింగ్‌ గురించి తెలిసిందే! తనకు సమయం దొరికిన ప్రతిసారీ నెట్టింట అభిమానులతో మాట్లాడుతుంటారు. తాజాగా ఆమె అభిమానులతో ముచ్చటించారు. ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఓ నెటిజన్‌ 9Chitchat with Netizens) మీకు ఇష్టమైన ప్రాంతం ఏదని ప్రశ్నించగా.. కూర్గులో ఉన్న మా ఇల్లంటే నాకెంతో ఇష్టం’ అని చెప్పింది రష్మిక. హైదరాబాద్‌లో ఉన్నా మీ స్నేహితులతో ఎలా మాట్లాడతారు? అన్న ప్రశ్నకు ‘నమేస్త.. ఎట్లున్నారు.. వచ్చేసేయ్‌, మస్తుంది...ఏంది, నీయమ్మ, కొడదాం’ ఇవే మాట్లాడుతుంటా’’ అని చెప్పారు. అలాగే తనకు ఆరు భాషల్లో మాట్లాడటం వచ్చని తెలుగు, తమిళ, కన్నడ, హిందీ తదితర భాషల్లో మాట్లాడి అలరించింది. కొరియన్‌ ఫ్రైడ్‌ చికెన్‌ అంటే ఎంతో ఇష్టమని రష్మిక తెలిపింది. వృత్తి పట్ల తనకున్న నిబద్ధతే తనను ఈ స్టేజ్‌లో ఉంచిందని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం రష్మిక మూడు చిత్రాల్లో నటిస్తోంది. ప్యాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ‘పుష్ప2’ (Pushpa2) లో శ్రీవల్లిగా (Srivalli) అలరించనుంది. బాలీవుడ్‌లో రణ్‌బీర్‌ కపూర్‌కు జోడిగా ‘యానిమల్‌’లో నటిస్తోంది. సందీప్‌ వంగా రూపొందిస్తోన్న ఈ చిత్రం డిసెంబర్‌ 1న విడుదల కానుంది. తొలిసారి ఆమె నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం ‘రెయిన్‌ బో’ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.

Updated Date - 2023-07-11T12:46:18+05:30 IST