Rashmka mandana: అమ్మలా రక్షించాలనుకుంటున్నా

ABN , First Publish Date - 2023-01-04T00:50:13+05:30 IST

టాలీవుడ్‌ అగ్రతార సమంత పై నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె అద్భుతమైన నటి అందగత్తె, దయా గుణం ఎక్కువ అని కొనియాడారు.

Rashmka mandana: అమ్మలా రక్షించాలనుకుంటున్నా

టాలీవుడ్‌ అగ్రతార సమంత పై నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె అద్భుతమైన నటి అందగత్తె, దయా గుణం ఎక్కువ అని కొనియాడారు. ఒక అమ్మ లాగా ఆమెను ఎప్పుడూ సంరక్షించాలనుకుంటున్నాను. మయోసైటిస్‌ గురించి సమంత ప్రకటించిన తర్వాతే నాక్కూడా తెలిసింది. అంతకు ముందు తను ఎప్పుడూ ఆ విషయం గురించి మాట్లాడిన సందర్భం లేదు. ‘జీవితంలో సవాళ్లతో పోరాడి నిలబడిన వ్యక్తిని ఎలాగైతే స్ఫూర్తిగా తీసుకుంటామో ఆవిడను చూసి నేను అలాగే ప్రేరణగా తీసుకున్నాను. త్వరలోనే సమంత కోలుకొని అన్ని విధాల ఆమె యాక్టివ్‌గా ఉండాలని కోరుకుంటున్నా. తాజాగా రష్మిక నటించిన వారిసు’ చిత్రం ఈ నెల 12న విడు

Updated Date - 2023-01-04T09:54:00+05:30 IST