Ram charan : క్యూట్‌గా ఉంది.. ఖాయం చేసేయండి!

ABN , First Publish Date - 2023-10-01T10:54:55+05:30 IST

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. రామ్‌చరణ్‌ 16వ వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌, వృద్థి సినిమాస్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Ram charan : క్యూట్‌గా ఉంది.. ఖాయం చేసేయండి!

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram charan) హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. రామ్‌చరణ్‌ 16వ (RC16) వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌, వృద్థి సినిమాస్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవల నూతన కార్యాలయాన్ని ప్రారంభించి ప్రీ ప్రొడక్షన్‌ పనులు మొదలుపెట్టారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. బాలీవుడ్‌కి చెందిన స్టార్‌ హీరోయిన్ కుమార్తె ఈ చిత్రంలో రామ్‌చరణ్‌కు జోడీగా నటించబోతోందని తెలుస్తోంది. బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయినగా గుర్తింపు తెచ్చుకున్న రవీనా టాండన గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగులోనూ ఆమె కథానాయికగా నటించింది. ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కొనసాగుతున్నారు. ఇప్పుడామె కుమార్తె రాషా థడానీ (Rasha thadani)ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేందుకు సిద్థమయ్యారు. ఇప్పటికే హిందీలో ఓ సినిమా అంగీకరించిన ఆమె తాజాగా రామ్‌చరణ్‌16 కోసం రంగంలో దిగినట్లు తెలిసింది. ఈ మేరకు కథా చర్చల కోసం ఆమె హైదరాబాద్‌ వచ్చినట్లు వార్తలొస్తున్నాయి. లుక్‌ టెస్ట్‌ కోసమే ఆమె హైదరాబాద్‌ వచ్చారని పలు వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. ‘ఆమె ఎంతో క్యూట్‌ ఉందని, చరణ్‌ పక్కనే రాషా థడానీ హీరోయిన్‌గా ఖాయం కావాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Raveena.jpg

అయితే అసలు విషయం ఏంటనేది తెలియాలంటే నిర్మాణ సంస్థ ప్రకటన ఇవ్వాల్సిందే. గామీణ నేపథ్యంలో స్పోర్ట్స్‌ డ్రామాగా... ఈ చిత్రం తెరకెక్కనుంది. చరణ్‌ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండనుందని దర్శకుడు ఇటీవల ఓ వేదికపై చెప్పారు. తన గత చిత్రాలతో కంపేర్‌ చేస్తే ఈ చిత్రం తన కెరీర్‌కు ఎంతో ప్రత్యేకం కానుందని, అసలైన మట్టి చిత్రమని రామ్‌చరణ్‌ కూడా చెప్పారు. ఎ.ఆర్‌.రెహమాన స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రస్తుతం రామ్‌చరణ్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Chagnger) చిత్రం చేస్తున్నారు. దిల్‌ రాజు భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం పూర్తయిన తర్వాత చరణ్‌ ఆర్‌సీ 16 చిత్రం షూటింగ్‌ మొదలుపెట్టనున్నారు.

Updated Date - 2023-10-01T11:06:39+05:30 IST