scorecardresearch

Rana Daggubati: నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు!

ABN , First Publish Date - 2023-08-15T17:25:19+05:30 IST

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ‘కింగ్‌ ఆఫ్‌ కోథా’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో హీరో రానా వ్యాఖ్యలు వివాదస్పదమైన సంగతి తెలిసిందే! దీంతో మంగళవారం ట్విట్టర్‌ వేదికగా దుల్కర్‌, సోనమ్‌ కపూర్‌లకు రానా క్షమాపణ చెప్పారు. ‘వాళ్లంటే నాకు ఎంతో గౌరవం’ అని పేర్కొన్నారు.

Rana Daggubati: నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు!

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ‘కింగ్‌ ఆఫ్‌ కోథా’ (king of kotha) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో హీరో రానా వ్యాఖ్యలు వివాదస్పదమైన సంగతి తెలిసిందే! దీంతో మంగళవారం ట్విట్టర్‌ వేదికగా దుల్కర్‌( Dulquer Salmaan), సోనమ్‌ కపూర్‌లకు రానా (rana daggubati) క్షమాపణ చెప్పారు. ‘వాళ్లంటే నాకు ఎంతో గౌరవం’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. అసలు విషయంలోకి వెళ్తే.. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా అభిలాష్‌ జోషిలీ తెరకెక్కించిన చిత్రం ‘కింగ్‌ ఆఫ్‌ కోథా’. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు రానా అతిథిగా హాజరయ్యారు. ఆ ఈవెంట్‌లో రానా మాట్లాడుతూ.. ‘‘దుల్కర్‌కు చాలా ఓపిక ఎక్కువ. కోపం అసలు రాదు. నేనొకసారి అతను చేస్తున్న హిందీ సినిమా షూటింగ్‌కు వెళ్లా. అక్కడ ఓ స్టార్‌ హీరోయిన్‌ షాట్‌కి రాకుండా చాలా సమయం వృథా చేసింది. ఆమె కోసం దుల్కర్‌ ఎండలో వేచిచూస్తుంటే.. ఆమె మాత్రం తన భర్తతో షాపింగ్‌ గురించి చాలా సేపుు మాట్లాడుతూనే ఉంది. అది చూసి నాకు కోపం వచ్చింది. నా చేతిలో ఉన్న వాటర్‌ బాటిల్‌ విసిరేశాను. కానీ, దుల్కర్‌ మాత్రం చాలా ప్రశాంతంగా షూటింగ్‌ పూర్తి చేశాడు’’ అని అన్నారు.

దీంతో నెటిజన్లంతా ఆ హీరోయిన్‌ సోనమ్‌ కపూర్‌ (Sonam kapoor) అంటూ ఆమెను ట్రోల్‌ చేయడం మొదలు పెట్టారు. ఈ మొత్తం వ్యవహారంపై రానా తన ట్విటర్‌లో వివరణ ఇస్తూ వాళ్లకు క్షమాపణ చెప్పారు. ‘‘నా వ్యాఖ్యలను చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు. తనను ట్రోల్‌ చేస్తుంటే నాకు ఇబ్బందిగా ఉంది. మేమంతా ేస్నహితులం. దుల్కర్‌, సోనమ్‌ అంటే నాకు ఎంతో గౌరవం. నా మాటల వల్ల వాళ్లు చాలా ప్రతికూలతను ఎదుర్కొంటున్నారు. అందుకే వాళ్లకు క్షమాపణ చెబుతున్నాను. ఇప్పటితో ఈ వివాదానికి ముగింపు పలుకుతారని ఆశిస్తున్నా. దయచేసి అర్థం చేసుకోండి’’ అని ట్వీట్‌ చేశారు.

Updated Date - 2023-08-17T09:19:46+05:30 IST