కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rana Daggubati: రానా కొత్త లుక్‌ అదిరింది

ABN, First Publish Date - 2023-12-14T12:34:44+05:30

రానా(RAna)తో 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రం తీసి పదేళ్ల తర్వాత హిట్‌ అందుకున్నారు దర్శకుడు తేజ(Teja). ఆ తర్వాత తీసిన 'సీత’ అంతంత మాత్రంగానే ఆడింది. తాజాగా దగ్గుబాటి అభిరామ్‌ను హీరోగా పరిచయం చేస్తు తీసిన 'అహింస' డిజాస్టర్‌ టాక్‌ తెచ్చుకుంది. 'నేనే రాజు నేనే మంత్రి' బ్లాక్‌బస్టర్‌ చిత్రం తర్వాత వీరి కాంబినేషన్లో సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు

రానా(RAna)తో 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రం తీసి పదేళ్ల తర్వాత హిట్‌ అందుకున్నారు దర్శకుడు తేజ(Teja). ఆ తర్వాత తీసిన 'సీత’ అంతంత మాత్రంగానే ఆడింది. తాజాగా దగ్గుబాటి అభిరామ్‌ను హీరోగా పరిచయం చేస్తు తీసిన 'అహింస' డిజాస్టర్‌ టాక్‌ తెచ్చుకుంది. 'నేనే రాజు నేనే మంత్రి' బ్లాక్‌బస్టర్‌ చిత్రం తర్వాత వీరి కాంబినేషన్లో సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అభిమానులు కోరిక తీరే అప్‌డేట్‌ ఇచ్చారు రానా - తేజ.

ఈ సక్సెస్‌ ఫుల్‌ కాంబోలో ఓ చిత్రం రాబోతుంది. గురువారం రానా పుట్టినరోజు సందర్భంగా కొత్త చిత్రం టైటిల్‌ను ప్రకటించారు. ఈ చిత్రానికి 'రాక్షస రాజా’ (Rakshasa Raja) అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ ఫస్ట్‌ లుక్‌లో రానా గన్ పట్టుకుని వైల్డ్‌ లుక్‌లో కనిపించారు. గ్యాంగ్‌స్టర్‌ యాక్షన్  డ్రామాగా ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. ఇప్పటి వరకూ చేయని పాత్రలో రానా నటిస్తున్నారని టాక్‌ నడుస్తోంది. ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తారు.

Updated Date - 2023-12-14T12:35:14+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!