సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Venkatesh Daggubati: ‘సైంధవ్' మొదలవుతోంది, పోయిన ఇమేజ్ మళ్ళీ వస్తుందా !

ABN, First Publish Date - 2023-03-21T13:44:39+05:30

సీనియర్ నటుడు వెంకటేష్ కి 'రానా నాయుడు' అనే వెబ్ సిరీస్ చాలా డామేజ్ చేసింది. అతని ఇమేజ్ దెబ్బతింది. ఇప్పుడు దర్శకుడు శైలేష్ కొలను తో ‘సైంధవ్' అనే సినిమా చేస్తున్నాడు. మరి పోయిన ఇమేజ్ తిరిగి వస్తుందా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెంకటేష్ దగ్గుబాటి (Venkatesh Daggubati), హిట్ దర్శకుడు శైలేష్ కొలను (Sailesh Kolanu) 'సైంధవ్' (Saindhav) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మచ్చుకి ఈ సినిమా నుండి ఆమధ్య ఒక చిన్న టీజర్ లాంటిది విడుదల చేశారు. వెంకటేష్ పక్కన 'జెర్సీ' (Jersey) ఫేమ్ శ్రద్ధ శ్రీనాథ్ (Shraddha Srinath) కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా తండ్రి, కూతుళ్ళ మధ్య నడిచే అనుబంధం మీద ఉంటుంది అని తెలుస్తోంది. అలాగే ఇందులో సైన్స్ ఫిక్షన్ కూడా ఉండొచ్చు అని కూడా తెలిసింది. దర్శకుడు శైలేష్ కొలను ఇంతకు ముందు 'హిట్' (Hit) సిరీస్ చేసాడు. మొదటిది 'హిట్' విశ్వక్ సేన్ (Vishwak Sen)తో, తరువాత 'హిట్ 2' (Hit 2) అడివి శేష్ (Adivi Sesh) తో చేసాడు. రెండు సినిమాలు విజయాన్ని సాధించాయి. ఈ 'సైంధవ్' సినిమా షూటింగ్ ఈనెల 23 నుండి హైదరాబాద్ లో ప్రారంభం అవుతుందని తెలుస్తోంది.

వెంకటేష్ ఈమధ్య 'రానా నాయుడు' (Rana Naidu) అనే వెబ్ సిరీస్ చేసాడు. ఇది 'రే డొనోవన్' (Ray Donovan) అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ కి అనుకరణ. అయితే ఈ 'రానా నాయుడు' (#RanaNaidu) వెబ్ సిరీస్ లో శృంగారం శృతిమించింది అని చాలామంది అంటున్నారు. రాజకీయనాయకులు, ఇతర సెలబ్రిటీస్ ఈ వెబ్ సిరీస్ ని బాగా విమర్శించటమే కాకుండా, వెబ్ సిరీస్ ల మీద కూడా సెన్సార్ ఉండాలి అని అంటున్నారు.

అలాగే ఈ వెబ్ సిరీస్ లో వెంకటేష్ ఒక వైవిధ్యమయిన పాత్ర చేసినప్పటికీ, అతని ఇమేజ్ బాగా దెబ్బతింది. వెండి తెర మీద వెంకటేష్ ని ఎప్పుడూ, ఎన్నడూ ఆలా చూడాలని ప్రేక్షకులు ఇలా ఒక కొత్త అవతారంలో, అదీ కాకుండా అతని మాటలు ఈ వెబ్ సిరీస్ లో కొంచెం వలన, జీర్ణించుకోలేక పోతున్నారు. ఇదేంటి వెంకటేష్ ఇలా చేస్తున్నాడు అని ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు బాగా డిసప్పోయింట్ అయ్యారు అని అంటున్నారు. వెంకటేష్ కి మహిళా అభిమానులే ఎక్కువ.

ఇప్పుడు ఈ ‘సైంధవ్' సినిమాతో వెంకటెహ్ పోయిన ఇమేజ్ వస్తుందా అని ఒక చర్చ నడుస్తోంది. ఎందుకంటే 'రానా నాయుడు' వెబ్ సిరీస్ చాలా బాడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ‘సైంధవ్' సినిమా ఒక పదేళ్ల కూతురు, తండ్రి మధ్య నడిచే అనుబంధం అని అంటున్నారు. అలాగే ఇందులో కూతురు గా నటించేందుకు ఢిల్లీ నుండి ఒక పాపని తెచ్చినట్టుగా చెప్తున్నారు.

Updated Date - 2023-03-21T13:44:41+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!