Rana daggubati-Project K: ఆ రెండు చిత్రాల రికార్డులకు బ్రేక్‌..

ABN , First Publish Date - 2023-06-02T15:59:22+05:30 IST

ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న ‘ఆదిపురుష్‌’, ‘సలార్‌’, ‘ప్రాజెక్ట్‌ కె’ చిత్రాలు అన్నింటి పైనా భారీ అంచనాలున్నాయి. వీటిలో దేనికదే ప్రత్యేకమైన సినిమాగా చెప్పుకోవచ్చు.ఈ సినిమాను ఆకాశానికి ఎత్తేస్తూ హీరో రానా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Rana daggubati-Project K: ఆ రెండు చిత్రాల రికార్డులకు బ్రేక్‌..

ప్రభాస్‌ (Prabhas) హీరోగా రూపొందుతున్న ‘ఆదిపురుష్‌’, ‘సలార్‌’, ‘ప్రాజెక్ట్‌ కె’ (Project K)చిత్రాలు అన్నింటి పైనా భారీ అంచనాలున్నాయి. వీటిలో దేనికదే ప్రత్యేకమైన సినిమాగా చెప్పుకోవచ్చు. అయితే భారీ తారాగణంతో అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పడుకోన్‌ వంటి అగ్ర తారలతో నాగ్‌ అశ్విన్‌ రూపొందిస్తున్న ‘ప్రాజెక్ట్‌ కె’ చిత్రంపై రెట్టింపు అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను ఆకాశానికి ఎత్తేస్తూ హీరో రానా (Rana Comments) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఇంగ్లిష్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రాజెక్ట్‌ కె గురించి మాట్లాడారు రానా. (Babubali, RRR Records)

‘‘మరి కొంతకాలంలో ప్రభాస్‌ నటిస్తున్న ‘ప్రాజెక్ట్‌-కె’ (Project k) ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు ప్రేక్షకులంతా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బ్లాక్‌బస్టర్‌ సినిమా ఇది. ఇప్పటి వరకు ఉన్న ‘బాహుబలి’ ‘ఆర్‌ఆర్‌ఆర్‌ రికార్డులను బ్రేక్‌ చేస్తుంది. నేనూ ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా. ఈసినిమా కూడా గ్లోబల్‌ స్ఠాయిలో గుర్తింపు పొందుతుందని నేను భాగా నమ్ముతాను. ఇప్పుడు భారతీయ చిత్రాలు విదేశాల్లోనూ సత్తా చాటుతున్నాయి. ప్రపంచ దేశాలు మన సంస్కృతిని ఎంతో గౌరవిస్తున్నాయి. అలాగే మంచి కథతో వచ్చిన సినిమాకు ఎక్కడైనా ఆదరణ దక్కుతుంది’’ అని రానా అన్నారు.

ప్రభాస్‌ సరసన దీపికా పడుకోన్‌ హీరోయిన్‌గా, అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రధారిగా నటిస్తున్న ఈ చిత్రంలో కమల్‌హాసన్‌ విలన్‌గా నటించబోతున్నారని టాక్‌ నడుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి.అశ్వినీదత్‌ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Updated Date - 2023-06-02T15:59:22+05:30 IST