సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

RC16 - Team Clarity: అతని బయోపిక్‌ కాదు!

ABN, First Publish Date - 2023-04-27T16:38:06+05:30

గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram charan) హీరోగా ‘ఉప్పెన’ ఫేం సానా బుచ్చిబాబు (Sana buchibabu)ఆర్‌సీ16 (Rc16), తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram charan) హీరోగా ‘ఉప్పెన’ ఫేం సానా బుచ్చిబాబు (Sana buchibabu)ఆర్‌సీ16 (Rc16), తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే! ప్యాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని ప్లాన్‌ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. సెప్టెంబర్‌లో ఈ చిత్రం సెట్స్‌ మీదకెళ్లనుంది. తాజాగా ఈ చిత్రం కథపై కొన్ని గాసిప్‌లు వైరల్‌ అవుతున్నాయి. ఉత్తరాంధ్రాకు చెందిన మల్లయోధుడు కోడి రామ్మూర్తి జీవిత కథతో బుచ్చి బాబు ఈ కథ సిద్థం చేశారని, రామ్మూరి పాత్రలో రామ్‌ చరణ్‌ కనిపిస్తారని ప్రచారం మొదలైంది. ఆ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని రామ్‌చరణ్‌ టీమ్‌ స్పష్టం చేసింది. చరణ్‌, బుచ్చి బాబు కలయికలో రాబోతున్న సినిమా బయోపిక్‌ కాదని పేర్కొంది.

(Rc team Clarity on RC16)

రామ్‌ చరణ్‌ - సానా బుచ్చి బాబు సినిమాతో సతీష్‌ కిలారు నిర్మాతగా పరిచయం అవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సమర్పణలో వృద్థి సినిమాస్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ సెప్టెంబర్‌లో మొదలవుతుందని రామ్‌చరణ్‌ ఇటీవల ఓ వేదికపై తెలిపారు. అంతే కాదు తన పాత్రకు గురించి చిన్న హింట్‌ ఇచ్చారు. ఇందులో తన పాత్ర పాత్‌ బ్రేకింగ్‌గా ఉంటుందని, భారతీయ మట్టి అంత గొప్న సినిమా అని తెలిపారు. గతంలో చేసిన పాత్రలకు ధీటుగా ఉంటుందని చెర్రీ చెప్పారు. ప్రస్తుతం రామ్‌ చరణ్‌ అగ్ర దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రం చేస్తున్నారు. తన భార్య ఉపాసన డెలివరీ టైమ్‌ దగ్గర పడుతుండడంతో ఓ మూడు నెలలు చెర్రీ విరామం తీసుకుంటారు. తదుపరి ఆర్‌సీ 16 షూటింగ్‌ మొదలుపెడతారు.

Updated Date - 2023-04-27T16:44:11+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!