Ram Charan Hulchul: శర్వా పెళ్లిలో రామ్‌చరణ్‌ సందడి!

ABN , First Publish Date - 2023-06-03T12:23:44+05:30 IST

హీరో శర్వానంద్‌ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. శనివారం రాత్రి 11 గంటలకు రక్షితా రెడ్డిని వివాహం చేసుకోబోతున్నారు. రాజస్థాన్‌, జైపూర్‌లోని లీలా ప్యాలస్‌ ఈ వివాహ వేడుకకు వేదికైంది. తదుపరి సంగీత్‌ కార్యక్రమాలన్ని నిర్వహించారు. దీనికి శర్వానంద్‌ స్నేహితుడైన రామ్‌చరణ్‌ హాజరై వేదిక దగ్గర సందడి చేశారు.

Ram Charan Hulchul: శర్వా పెళ్లిలో రామ్‌చరణ్‌ సందడి!

హీరో శర్వానంద్‌(Sharwanand Wedding) ఓ ఇంటివాడు కాబోతున్నాడు. శనివారం రాత్రి 11 గంటలకు రక్షితా రెడ్డిని (Rakshita Reddy) వివాహం చేసుకోబోతున్నారు. రాజస్థాన్‌, జైపూర్‌లోని లీలా ప్యాలస్‌ ఈ వివాహ వేడుకకు వేదికైంది. శుక్రవారం కుటుంబ సభ్యులు, సన్నిహితులు సమక్షంలో హల్దీ వేడుక ఘనంగా జరిగింది. ఈ తంతులో శర్వా సరదాగా తన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు పసుపు రాసి ఆట పట్టించారు. తదుపరి సంగీత్‌ కార్యక్రమాలన్ని నిర్వహించారు. దీనికి శర్వానంద్‌ స్నేహితుడైన రామ్‌చరణ్‌ హాజరై వేదిక దగ్గర సందడి చేశారు. ఆయనతోపాటు చెర్రీ స్నేహితుడు విక్రమ్‌ (విక్కీ) కూడా జైపూర్‌ వెళ్లారు. (Ram charan at sharwanand Wedding)

సంగీత్‌ కార్యక్రమంలో శర్వానంద్‌ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో ‘పూనకాలు లోడింగ్‌’(poonakalu loading) పాటకు అదిరిపోయే స్టెప్పులేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. శర్వానంద్‌కు కాబోయే భార్య సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయి. ఆమె తండ్రి తెలంగాణ హైకోర్డ్‌ న్యాయమూర్తి. వివాహం అనంతరం శర్వానంద్‌ శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం షూటింగ్‌లో పాల్గోనున్నారు.

Updated Date - 2023-06-03T12:24:23+05:30 IST