Skanda two-day collections: రామ్ పోతినేని సినిమా రెండో రోజు కలెక్షన్స్ కూడా బాగున్నాయి

ABN , First Publish Date - 2023-09-30T12:38:14+05:30 IST

'స్కంద' సినిమా మొదటి రోజు రెండు రాష్ట్రాల్లో సుమారు రూ 8.62 కోట్లు షేర్ కలెక్టు చేసి రామ్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ ఇస్తే, రెండో రోజు సుమారు రూ. 3.49 కోట్లు షేర్ కలెక్టు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర బాగానే పోతోంది. రాబోయే మూడు రోజులు కీలకం అని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు.

Skanda two-day collections: రామ్ పోతినేని సినిమా రెండో రోజు కలెక్షన్స్ కూడా బాగున్నాయి
Ram Pothineni from Skanda film

రామ్ పోతినేని (RamPothineni), బోయపాటి (BoyapatiSreenu) కాంబినేషన్ లో వచ్చిన 'స్కంద' #Skanda రెండో రోజు కలక్షన్స్ కూడా బాగానే ఉన్నాయని కలెక్షన్స్ బట్టి తెలుస్తోంది. #SkandaSecondDayCollections ఎందుకంటే మొదటి రోజు రామ్ కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న 'స్కంద' సినిమా రెండో రోజు రూ.3.49 కోట్ల రూపాయలు షేర్ తెచ్చుకుంది. ఇది కేవలం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో కలెక్టు చేసిన రెవిన్యూ అని చిత్ర నిర్వాహకులు చెపుతున్నారు. మొదటి రోజు ఈ సినిమాకి మిశ్రమ టాక్ వచ్చింది, అయితే రెండో రోజు కలెక్షన్స్ మాత్రం అంత పెద్దగా లేకపోయినా పూర్తిగా అయితే పడిపోలేదు.

ఈ సినిమా మొదటి రోజు సుమారు రూ. 8.62 కోట్లు రెండు రాష్ట్రాల్లో కలెక్టు చేసి రామ్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ గా నిలిచింది. ఈరోజు శనివారం, రేపు ఆదివారం, అలాగే సోమవారం గాంధీ జయంతి సందర్భంగా సెలవు దినం అవటంతో, ఈ సినిమా కలెక్షన్స్ అలాగే కంటిన్యూ అవుతాయని చిత్ర నిర్వాహకులు భావిస్తున్నారు.

rampothineni-skanda2.jpg

మొదటి రోజు నైజాం ఏరియాలో రూ. 4.75 కోట్లు కలెక్టు చేస్తే, రెండో రోజు అదే ఏరియాలో రూ. 1.52 కోట్లు కలెక్టు చేసినట్టుగా ట్రేడ్ అనలిస్ట్స్ చెపుతున్నారు. రాబోయే మూడు రోజులే ఈ సినిమాకి చాలా కీలకం అని అంటున్నారు. ఇది ఒక యాక్షన్ డ్రామా గా తెరకెక్కించిన బోయపాటి తనదయిన మార్కు పోరాట సన్నివేశాలను ఈ చిత్రంలో చూడవచ్చు. శ్రీలీల (Sreeleela), సాయీ మంజ్రేకర్ (SaieeManjrekar) కథానాయకులుగా నటించారు. ఇందులో చివర్లో బోయపాటి ఒక చిన్న ఆశ్చర్యం కలిగించే పాత్రను కూడా చూపించారు.

రెండో రోజు ఆంధ్ర, తెలంగాణాలో 'స్కంద' షేర్ కలెక్షన్స్:

నైజాం: రూ. 1.52 కోట్లు

సీడెడ్: రూ. 54 లక్షలు

విశాఖపట్నం: రూ. 41 లక్షలు

ఈస్ట్ గోదావరి: రూ. 27 లక్షలు

వెస్ట్ గోదావరి: రూ. 17 లక్షలు

కృష్ణ: రూ. 16 లక్షలు

గుంటూరు: రూ. 29 లక్షలు

నెల్లూరు: రూ. 13 లక్షలు

మొత్తం: రూ. 3.49 కోట్లు

రెండు రోజులకి కలిపి మొత్తం షేర్: రూ. 12.11 కోట్లు

Updated Date - 2023-09-30T12:38:14+05:30 IST