BoyapatiRapo: బోయపాటి, రామ్ పోతినేని సినిమా టీజర్ ఎలా ఉందంటే...

ABN , First Publish Date - 2023-05-15T11:50:40+05:30 IST

రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న సినిమా మొదటి సారిగా ఈరోజు రామ్ పుట్టినరోజు సందర్భంగా ఒక చిన్న టీజర్ విడుదల చేశారు. అదెలా ఉందంటే...

BoyapatiRapo: బోయపాటి, రామ్ పోతినేని సినిమా టీజర్ ఎలా ఉందంటే...
Ram Pothineni

రామ్ పోతినేని (RamPothineni) పుట్టినరోజు సందర్భంగా #RAPO ఈరోజు అంటే మే 15వ తేదీన అతని రాబోయే సినిమా నుండి ఒక చిన్న టీజర్ లాంటిది విడుదల చేశారు. దీనికి బోయపాటి శ్రీను (BoyapatiSreenu) దర్శకుడు కాగా, చిట్టూరి శ్రీనివాస్ (ChitturiSrinivas) నిర్మాత. ఈ టీజర్ ఒక యాక్షన్ సన్నివేశంతో మొదలెట్టేసాడు. ఇది చూడగానే ఈ సినిమాలో కావలసినంత మసాలా ఉంటుందని, ఇది ఒక టిపికల్ బోయపాటి మార్కు సినిమా అని అర్థం అవుతోంది.

rampothineni3.jpg

ఒక్క పోరాట సన్నివేశాలే కాకుండా, డైలాగ్స్ కూడా బోయపాటి మార్కు కనపడుతోంది. "నీ స్టేట్ దాటలేను అన్నావ్ దాటా, నీ గేట్ దాటలేను అన్నావ్ దాటా, నీ పవర్ దాటలేను అన్నావ్ డాటా, ఇంకేంటి దాటేది నా బొంగులో లిమిట్స్" అంటూ రామ్ పోతినేని డైలాగ్ #RAPO చెపుతూ యాక్షన్ సన్నివేశం లో ఉంటాడు. ఇవన్నీ చూస్తుంటే ఈ సినిమా ఒక మాస్ యాక్షన్ సినిమా అని అర్థం అయిపోతోంది.

అలాగే థమన్ (SSThaman) ఈ టీజర్ లో నేపధ్య సంగీతం అదరగొట్టాడు. ఎందుకంటే ఇలాంటి యాక్షన్ సినిమాలకి నేపధ్య సంగీతం చాలా ముఖ్యం, అందుకని థమన్ మరోసారి తన ప్రతిభని చూపించాడు. అలాగే 'రాపో, రాపో' #RAPO అంటూ నేపథ్యంలో అని చిన్న సాంగ్ లో పెట్టడం కూడా ఇది ఒక మంచి పుట్టినరోజు కానుక అనే చెప్పాలి. అలాగే రామ్ ఈ సినిమా కోసం చాలా బరువు పెరిగినట్టు కనిపిస్తున్నాడు. అందుకే బొద్దుగా వున్నాడు. మొత్తం మీద, బోయపాటి ఎటువంటి నటుడిని అయినా ఎలా మాసీ గా చూపించాలో తెలుసు. ఇందులో శ్రీలీల (Sreeleela) కథానాయకురాలు.

Updated Date - 2023-05-15T11:50:40+05:30 IST