RAPO30- Skanda: నేను దిగితే మిగిలేది ఉండదు..

ABN , First Publish Date - 2023-07-03T14:41:30+05:30 IST

ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే! తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ వచ్చింది. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి ఓ పవర్‌ఫుల్‌ టైటిల్‌ను ప్రకటించింది చిత్ర బృందం.

RAPO30- Skanda: నేను దిగితే మిగిలేది ఉండదు..

ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ పోతినేని (Ram potineni) హీరోగా బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే! తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ వచ్చింది. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి ఓ పవర్‌ఫుల్‌ టైటిల్‌ను ప్రకటించింది చిత్ర బృందం. ‘రాపో20’ (RAPO30) అనే వర్కింగ్‌ టైటిల్‌ ప్రచారంలో ఉన్న ఈ మూవీకి ‘స్కంద’ (Skanda) అనే పేరు ఖరారు చేశారు. ఈ మేరకు సోమవారం చిత్రబృందం టైటిల్‌ గ్లింప్స్‌ విడుదల చేసింది.

‘‘మీరు దిగితే ఓడేది ఉండదు.. నేను దిగితే మిగిలేది ఉండదు’’ అంటూ బోయపాటి మాస్‌, పవర్‌ఫుల్‌ డైలాగ్‌లను రామ్‌ ఎనర్జిటిక్‌గా చెప్పడం ఆకట్టుకుంటోంది. టీజర్‌లో యాక్షన్‌ సన్నివేశాలు అలరించేలా ఉన్నాయి. పక్కా మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్‌ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి క్లైమాక్స్‌ హైలైట్‌గా నిలుస్తుందని ఇప్పటికే రామ్‌ చెప్పారు. సెప్టెంబర్‌ 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్‌ నటించగా పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల అవుతున్న తొలి చిత్రమిది. తమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Updated Date - 2023-07-03T15:36:09+05:30 IST