Rgv - Vyuham : వ్యూహం సినిమా కోసం ఎంతమంది బయటకు వచ్చారంటే!

ABN , First Publish Date - 2023-11-02T22:06:02+05:30 IST

తన తాజా చిత్రం ‘వ్యూహం’(vyuham) రిలీజ్‌ను ఎవరూ అడ్డుకోలేరని దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ అన్నారు. ఈ నెల 10న విడుదల కావల్సిన ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్‌ పనుల్లో ఉంది. అయితే సెన్సార్‌ బోర్డ్‌ ఈ చిత్రానికి సర్టిఫికెట్‌ ఇవ్వకుండా రివైజింగ్‌ కమిటీకి రిఫర్‌ చేసింది.

Rgv - Vyuham : వ్యూహం సినిమా కోసం ఎంతమంది బయటకు వచ్చారంటే!

తన తాజా చిత్రం ‘వ్యూహం’(vyuham) రిలీజ్‌ను ఎవరూ అడ్డుకోలేరని దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ అన్నారు. ఈ నెల 10న విడుదల కావల్సిన ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్‌ పనుల్లో ఉంది. అయితే సెన్సార్‌ బోర్డ్‌ ఈ చిత్రానికి సర్టిఫికెట్‌ ఇవ్వకుండా రివైజింగ్‌ కమిటీకి రిఫర్‌ చేసింది. 'వ్యూహం’ సినిమాకు సెన్సార్‌ అడ్డంకులపై దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ, నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌ గురువారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. వర్మ మాట్లాడుతూ "ఇటీవల సినియాపు సెన్సార్‌కు పంపాం. సినిమా చూసిన సెన్సార్‌ వాళ్లు మా సినిమాను రివైజింగ్‌ కమిటీకి పంపిస్తున్నట్లు మెేసజ్‌ ఇచ్చారు. అయితే దానికి కారణం చెప్పలేదు. అందుకే సినిమాను వాయిదా వేస్తున్నాం. గతంలో ఉడ్తా పంజాబ్‌, పద్మావత్‌ వంటి సినిమాల విషయంలో రివైజింగ్‌ కమిటీల్లోనూ తేల్చుకుంటే కోర్టు ద్వారా సినిమా రిలీజ్‌ ఆర్డర్‌ తెచ్చుకున్నారు. సెన్సార్‌ అనేది సినిమా రిలీజ్‌ను ఆపకూడదని కోర్టులు చెబుతున్నాయి. మేము కూడా అదే దారిని అనుసరిస్తాం. చట్టపరంగా ఉన్న పద్థతుల ద్వారా వ్యూహం సినిమాను రిలీజ్‌ చేసుకుంటాం. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేరు. వ్యూహం సినిమా ద్వారా నా అభిప్రాయాలను చెప్పాను. ఆర్టికల్‌ 19 ప్రకారం పౌరుడిగా నా ఒపీనియన చెప్పే హక్కు నాకుంది. నేను గతంలో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌, కమ్మరాజ్యం సినిమా రూపొందించాను, అలాగే బాలీవుడ్‌ లో యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ అని సినిమాలు  చేశారు. అవన్నీ అపగలిగారా? వ్యక్తుల గురించైనా, ఏదైనా ఇష్యూ గురించైనా ఎవరి అభిప్రాయాలైనా చెప్పవచ్చు. సెన్సార్‌ అనేది మత సామరస్యం దెబ్బతినకుండా, కులాలను కించపరిచే సినిమాలు బయటకు రాకుండా లా అండ్‌ ఆర్డర్‌ కోణంలో అడ్డుకుంటుంది. అంతే గానీ వ్యక్తులపై  అభిప్రాయాలు చెప్పే సినిమాలను ఆపే పవర్‌ సెన్సార్‌కు లేదు. రివైజింగ్‌ కమిటీకి ఎప్పుడు పంపిస్తారో డేట్‌ చెప్పలేదు. వాళ్లు చూసి ఏం చెప్తారో చూసి నెక్ట్స్‌ స్టెప్స్‌ తీసుకుంటాం’’ అని అన్నారు. నారా లోకేష్‌ సెన్సార్‌ బోర్డుకు లేఖ రాశారని విన్నాను. అయితే అది నేనే చూడలేదు. సెన్సార్‌ అవుడేటెడ్‌ సిస్టమ్‌ అని నా పర్సనల్‌ ఒపీనియన్‌" అని అన్నారు 

జీవితను 'వ్యూహం’ సినిమా వరకు సెన్సార్‌ చేయకుండా తొలగించాలని నిర్మాత నట్టి కుమార్‌ ఓ లేఖ రాశారు. అందుకు కారణాలు చెబుతూ నట్టి కుమార్‌ ఓ లేఖను విడుదల చేశారు. మరోవైపు ఈ సినిమాను విడుదల చేయకుండా నిలపాలని ఎలక్షన కమిషనకు ఫిర్యాదు చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రాలో అధికారంలో ఉన్న వైసీపీలో జీవిత రాజశేఖర్‌ నాయకురాలిగా ఉన్నందున్న ఈ సినిమాకు ఎలాంటి అభ్యంతరం లేకుండా సెన్సార్‌ చేయమని సహజంగానే వత్తిడి చేస్తోంది. ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని వ్యూహం సినిమా సెన్సార్‌ నుంచి జీవిత రాజశేఖర్‌ గారిని తప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని నట్టి కుమార్‌ పేర్కొన్నారు.

నేనే బీజేపీలోనే ఉన్నా: జీవితా రాజశేఖర్‌

నట్టికుమార్ చేసిన వ్యాఖ్యలకు జీవిత   స్పందించారు . "నేను ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నా. నాకు, వైసీపీకి ఎలాంటి సంబంధం లేదు. ప్రస్తుతం మీడియాలో వైరల్‌ అవుతున్న ఫొటోలు కొంతకాలం క్రితానివి. వ్యూహం అనే సినిమా రివైజింగ్‌ కమిటీకి వచ్చినప్పుడు అన్ని సినిమాలు చూసినట్టుగానే ఆ సినిమాను కూడా చూస్తాను. నాకు ఇంకా ఆఫీస్‌ నుంచి ఎటువంటి సమాచారం లేదు. ఇప్పుడు నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు’’ అని జీవిత రాజశేఖర్‌ తెలిపారు.

Updated Date - 2023-11-02T22:06:03+05:30 IST