Ram Charan: ఆరెంజ్ కలెక్షన్స్ ఏ రేంజ్ లో వున్నాయో చూసారా

ABN , First Publish Date - 2023-03-28T18:54:27+05:30 IST

అప్పట్లో 'ఆరెంజ్' సినిమా యావరేజ్ ని స్వయానా ఆ సినిమా నిర్మాత, రామ్ చరణ్ బాబాయ్ అన్నారు. ఆ సినిమాని మళ్ళీ ఇప్పుడు విడుదల చేశారు, అయితే ఇప్పుడు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూసారా...

Ram Charan: ఆరెంజ్ కలెక్షన్స్ ఏ రేంజ్ లో వున్నాయో చూసారా
Ram Charan still from the film Orange

ఈమధ్య స్టార్ ల పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ పాత సినిమాలు విడుదల చెయ్యడం ఆనవాయితీగా మారింది. అందులో భాగంగానే రామ్ చరణ్ (Ram Charan birthday) పుట్టిన రోజు సందర్భంగా అతని పాత సినిమా 'ఆరెంజ్' (#Orange) ని మళ్ళీ విడుదల చేశారు. సుమారు పదమూడేళ్ల క్రితం విడుదల అయిన ఈ సినిమా అప్పట్లో పెద్దగా నడవలేదు. (OrangeMovie) ఈ సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) దర్శకుడు కాగా, జెనీలియా డిసౌజా (Genelia D'souza) కథానాయికగా చేసింది. ఇందులో పాటలు మాత్రం అప్పట్లో పెద్దగా హిట్ అయ్యాయి.

ఇప్పుడు మళ్ళీ విడుదల అయిన ఈ సినిమా కలెక్షన్స్ మాత్రం ఇరగదీస్తోంది. (OrangeFilm) ఈ సినిమాకి నిర్మాత రామ్ చరణ్ చిన్నాన్న నాగబాబు కొణిదెల (Nagababu Konidela). అప్పట్లో ఈ సినిమా చేసి బాగా లాస్ వచ్చిందని ఇంక సినిమాలు తీయటం కూడా ఆపేసాడు నాగబాబు. కానీ ఇప్పుడు కలెక్షన్స్ చూసి అతనే ఆశ్చర్యపోతున్నారు. శని, ఆదివారాలు అయితే అన్ని షోస్ హౌస్ ఫుల్స్ అవటం విశేషం. ఆ తరువాత కూడా ఈ సినిమా కలెక్షన్స్ ఏమాత్రం తగ్గకుండా ఇప్పుడున్న సినిమాలకి తీసిపోకుండా రెవిన్యూ రాబడుతోంది.

ramcharanorange1.jpg

అప్పట్లో ఇది యావరేజ్ సినిమా అని స్వయానా నిర్మాత, చిరంజీవి (Chiranjeevi) తమ్ముడు అయిన నాగబాబు ఒప్పుకున్నాడు. "అప్పటి జెనెరేషన్ కి ఈ సినిమా ఎక్కలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ విడుదల చేసినప్పుడు ఇప్పుడున్న జెనరేషన్ మైండ్ సెట్ కి అతుక్కున్నట్టుగా సింక్ అయింది. పెద్ద సినిమాకి వచ్చినట్టుగా కలెక్షన్స్ వచ్చాయి. ఇది మాకు ఆశ్చర్యంగా వుంది, అలాగే ఇది వూహించలేనిది కూడా. ఇంతమంది అభిమానులు ఈ సినిమాకి ఉన్నారా అని ఇప్పుడు కలెక్షన్స్ చూస్తే అనిపిస్తోంది", అని నాగబాబు చెప్పారు ఈ సినిమా కలెక్షన్స్ చూసి.

నైజాం ఏరియా లో ఇలా మళ్ళీ విడుదల అయినా చిత్రాలతో పోలిస్తే మొదటి రోజు కలెక్షన్స్ లో ఇది నాలుగో ప్లేస్ లో వుంది. చరణ్ ఇంకో బాబాయ్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమా 'ఖుషి' (Khushi) అగ్రస్థానం లో ఉండగా, కళ్యాణ్ దే ఇంకో సినిమా 'జల్సా' (Jalsa) రెండో స్థానం లో వుంది. మహేష్ బాబు 'ఒక్కడు' (Okkadu) మూడో స్థానం లో వుంది, ఇప్పుడు రామ్ చరణ్ 'ఆరంజ్' (OrangeTheFilm) నాలుగో స్థానం ఆక్రమించింది. మూడు రోజులకు గాను ఈ స్పెషల్ షోస్ వలన ఆరంజ్ సినిమాకి మొత్తం రూ.2.05 కోట్ల గ్రాస్ వచ్చినట్టుగా తెలుస్తోంది.

ramcharanparty8.jpg

ఇంకా సాంఘీక మాధ్యమాల్లో ఈ సినిమా గురించే చర్చ జరుగుతోంది. అప్పట్లో విడుదల అయినప్పుడు చూస్తే బాగుండేది కదా, ఇప్పుడు ఈ సినిమాని చూసి ఎవరికీ లాభం అని మేమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ఏమైనా కూడా అప్పటి సినిమాలు అన్నీ మళ్ళీ ఇప్పటి జెనరేషన్ వాళ్ళు థియేటర్ లో చూస్తున్నారు సంతోషంగా.

ఇదీ చదవండి

Ram Charan: బర్తడే పార్టీ ఫోటోస్ వైరల్

నాగ చైతన్య తో వున్న ఈ అమ్మడిని గుర్తు పట్టారా?

Updated Date - 2023-03-28T18:54:29+05:30 IST