UpasanaKamineni: ఉపాసన గురించి తప్పుగా మాట్లాడిన వాడిని చితకబాదిన రామ్ చరణ్ అభిమానులు

ABN , First Publish Date - 2023-05-14T13:07:27+05:30 IST

ఉపాసన గురించి తప్పుగా మాట్లాడిన వ్యక్తిని రామ్ చరణ్ అభిమానులు చితకబాదిన వీడియో వైరల్ అయింది. ఇదిలా ఉంటే, రామ్ చరణ్ భార్య ఉపాసన తన మొదటి 'మదర్స్ డే' గురించి ప్రస్తావిస్తూ ఒక ఫోటో పెట్టారు...

UpasanaKamineni: ఉపాసన గురించి తప్పుగా మాట్లాడిన వాడిని చితకబాదిన రామ్ చరణ్ అభిమానులు
Upasana and Ram Charan

రామ్ చరణ్ (RamCharan) అభిమానులు సునిశిత్ (Sunisith) అనే వ్యక్తిని చితకబాదుతూ వున్న వీడియో, ఫోటోస్ బాగా వైరల్ అవుతున్నాయి. కొంతమంది రామ్ చరణ్ అభిమానులు, ఒక వ్యక్తిని అతను ఉపాసనని ఎదో కామెంట్ చేసాడని పట్టుకొని చితక బాదారు. #MegaFans ఇది వీడియో కూడా తీసి, సాంఘిక మాధ్యమం లో పోస్ట్ చేశారు. దీనితో పాటు రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవి (Chiranjeevi) నటించిన 'వాల్తేరు వీరయ్య' (WaltairVeerayya) విజయోత్సవ వేడుకల్లో చెప్పిన వీడియో కూడా వైరల్ అవుతోంది. మేము సైలెంట్ గా వున్నాం అంటే, ఏమి చేయలేము అని కాదు అన్న మాటలు అందులో ఉంటాయి.

ఇప్పుడు సునిశిత్ అనే కుర్రవాడు కూడా రామ్ చరణ్ భార్య ఉపాసనని (UpasanaKamineni) ఎదో అన్నాడని, అందుకని మేము సైలెంట్ గా వుండం అని చెప్పడానికి సదరు ఆ కుర్రాడిని చితకబాదారు. అతని చేత క్షమాపణలు కూడా చెప్పించారు. ఇలా ఎప్పుడూ ఏ హీరో గురించి కానీ ఇలా తప్పుడు వ్యాఖ్యలు చెయ్యను అని అతనితో చెప్పించారు.

upasanakamineni-pregnant.jpg

ఇదిలా ఉంటే, ఈరోజు 'మదర్స్ డే' (MothersDay) సందర్భంగా ఉపాసన ఒక ఫోటో పోస్ట్ చేసింది. అందులో ఆమె ఇది తన మొదటి 'మదర్స్ డే' అని చెప్పారు. "నేను మాతృత్వాన్ని స్వీకరించడానికి గర్వపడుతున్నాను ఎందుకంటే ఇప్పుడు సరైన కారణాలు వున్నాయి కనక. ఎదో సమాజం కోసమో, లేదా వారసత్వాన్ని కొనసాగించాలనే కోరికతోనో, నా వివాహాన్ని బలోపేతం చేయాలనే కోరికతో నేను అమ్మను కావాలని. నేను మానసికంగా నా పుట్టబోయే బిడ్డకి ప్రేమ, అనురాగం పంచాలని అనుకున్నప్పుడు, నేను దానికి పూర్తిగా ప్రిపేర్ అయి వున్నప్పుడు బిడ్డను కనాలని ఎంచుకున్నాను," అని ఆ పోస్టులో చెప్పింది. అలాగే ఒక ఫోటో కూడా పెట్టింది.

Updated Date - 2023-05-14T13:07:27+05:30 IST