Ram Charan: ముంబైలోని సిద్ధి వినాయక ఆలయంలో అయ్యప్ప దీక్ష పూర్తి

ABN , First Publish Date - 2023-10-04T14:10:58+05:30 IST

ప్రతి సంవత్సరం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అయ్యప్ప దీక్ష చేపడతారు, అలాగే ఆ దీక్షకి అవసరం అయిన కఠిన నియమ నిబంధనలు పాటిస్తూ వుంటారు కూడా. ఈసారి అయ్యప్ప దీక్ష ముంబై లోని సిద్ధివినాయక టెంపుల్ లో విరమించారు.

Ram Charan: ముంబైలోని సిద్ధి వినాయక ఆలయంలో అయ్యప్ప దీక్ష పూర్తి
Ram Charan at Siddhi Vinayak Temple in Mumbai

మెగాస్టార్ చిరంజీవి (MegaStarChiranjeevi) తనయుడు, అగ్రనటుల్లో ఒకరు అయిన రామ్ చరణ్ (RamCharan) సినిమాల్లో ఎంత స్టైలిష్‌గా కనిపిస్తారో బయట అందుకు భిన్నంగా చాలా సింపుల్‌గా ఉంటారు. అయ్యప్ప స్వామి అంటే రామ్ చరణ్ కి అపారమైన భక్తి. అందుకే ప్రతీ సంవత్సరం అయ్యప్ప స్వామి మాలను వేసి దీక్షను తీసుకుంటుంటారనే సంగతి అందరికీ తెలిసిందే. ఎందుకంటే సినిమా నటుల్లో ఎక్కువగా రామ్ చరణ్ నే నల్ల దుస్తుల్లో చూస్తూ ఉంటాం, అది అయన అయ్యప్ప మాల వేసుకున్నారు అని అర్థం. ఈ ఏడాది కూడా ఆయన అయ్యప్ప దీక్షను తీసుకున్నారు. ఈ దీక్షను ముంబైలో సిద్ధి వినాయక ఆలయంలో పూర్తి చేశారు. రామ్ చరణ్ అచంచలమైన భక్తి విశ్వాసాలకు, నమ్మకానికి ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఓ ఉదాహరణ అని చెప్పొచ్చు.

అయ్యప్ప స్వామి దీక్షను పాటించే వారు చాలా నిష్టగా అన్నీ చెయ్యాలి, రామ్ చరణ్ అవన్నీ పాటిస్తారు. చాలామంది బయటకి వచ్చినప్పుడు చెప్పులు వేసుకుంటారు, కానీ రామ చరణ్ మాత్రం ఆ కఠినమైన నియమ నిబంధనలను అనుసరించి, చెప్పులు వేసుకోరు, అలాగే తిరుగుతూ వుంటారు. అలాగే ఈ దీక్ష తీసుకున్న వాళ్ళు నలుపు రంగు దుస్తులను ధరిస్తారు. సిద్ధి వినాయకుని ఆలయంలోకి వెళ్లిన సమయంలోనూ ఆయన ఇదే నియమాలను పాటించటం అనేది అభిమానులను ఆకర్షించింది. వారి హృదయాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాగే సిద్ధి వినాయకుని ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. అలాంటి ఆలయంలో రామ్ చరణ్ తన దీక్షను విరమించటం అందరి దృష్టిని ఆకర్షించింది.

రామ్ చరణ్ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ దీక్షను చేస్తుంటారు. 'ఆర్ఆర్ఆర్' #RRR, 'గేమ్ చేంజర్' #GameChanger వంటి భారీ సినిమాల్లో నటించే సమయంలోనూ ఆయన దీక్ష చేయటాన్ని విడిచి పెట్టలేదు. ఈ ఏడాది ఆయన కుమార్తె క్లీంకార (KlinKaara) రాకతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఓ వైపు వృతిపరమైన విషయాలతో పాటు ఆధ్యాత్మిక అంశాలను బ్యాలెన్స్ చేయటంలో రామ్ చరణ్ తన అంకిత భావాన్ని ప్రదర్శించారు.

Updated Date - 2023-10-04T14:10:58+05:30 IST