Ram Charan: పక్కా మట్టి సినిమా... పాత్‌ బ్రేకింగ్‌ క్యారెక్టర్‌!

ABN , First Publish Date - 2023-03-18T23:48:24+05:30 IST

రామ్‌చరణ్‌ ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో ‘ఆర్‌సీ15’ చిత్రంలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘సి.ఈ.ఓ’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. ఈ చిత్రం తర్వాత చెర్రీ చేయబోయే సినిమాపై క్లారిటీ ఇచ్చారు.

Ram Charan: పక్కా మట్టి సినిమా... పాత్‌ బ్రేకింగ్‌ క్యారెక్టర్‌!

రామ్‌చరణ్‌ (Ramcharan) ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో ‘ఆర్‌సీ15’ (Rc15)చిత్రంలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘సి.ఈ.ఓ’ (CEO) అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. ఈ చిత్రం తర్వాత చెర్రీ చేయబోయే సినిమాపై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న షెడ్యూల్‌ ప్రకారం శంకర్‌ (shankar) సినిమా తర్వాత చెర్రీ బుచ్చిబాబు సానా (buchibabu Saana) దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారని టాక్‌. ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందో చరణ్‌ తెలిపారు. ఢిల్లీ వేదికగా జరిగిన ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో ఆయన మాట్లాడుతూ ‘‘నా తదుపరి చిత్రం సెప్టెంబర్‌లో మొదలవుతుంది. ఈ చిత్రంలో నా పాత్ర పాత్‌ బ్రేకింగ్‌గా ఉంటుంది(Path breaking movie) . ఆ పాత్ర రంగస్థలం లాంటి నా పాత రికార్డులను బీట్‌ చేసేలా ఉంటుంది. మట్టిలాంటి పాత్ర అది. వెస్ట్రన్‌ ఆడియన్స్‌ కూడా ఈ చిత్రాన్ని బాగా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. నటుడిగా ఎక్కువ మందికి రీచ్‌ కావడమే నా లక్ష్యం.

హాలీవుడ్‌ సినిమాపై క్లారిటీ.. (Ram charan Clarity on next movie)

హాలీవుడ్‌ సినిమాలో నటిస్తున్నారని, కథ కూడా విన్నారనే టాక్‌ నడుస్తోంది అన్న ప్రశ్నకు చరణ్‌ సమాధానమిచ్చారు. ‘‘నేను హాలీవుడ్‌ సినిమాల్లో నటించాలనుకుంటున్నా. ఆ కల నెరవేరాలని కోరుకోండి. హాలీవుడ్‌ ప్రాజ్టెన్‌కు సంతకం చేశానా? లేదా? అనేది ఇప్పుడే మాట్లాడడం కరెక్ట్‌ కాదు. ఏ పనికైనా ఓ ప్రాసెస్‌ ఉంటుంది కదా. మెటీరియలైజ్‌ అయ్యేదాకా ప్రాసెస్‌లో ఉన్నట్లే కదా? కానీ తప్పకుండా ఆ ప్రాజెక్ట్‌ జరిగి తీరుతుంది(నవ్వుతూ). చాలా విషయాలు నేను బయటకు చెప్పను. జనాల దృష్టి మనపై పడకూడదని, దిష్టి తగలకూడదని అమ్మ తరచూ చెబుతుంటుంది.

సరిహద్దులు చెరిగిపోయాయి...

రానున్న రోజుల్లో రీజనల్‌ సినిమా అనేది ఉండదు. ఇప్పటిదాకా మనకు వెస్ట్‌ బెంగాల్‌ నుంచి తమిళనాడు వరకు ఎన్నో రీజినల్‌ సినిమా ఇండస్ర్టీలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ సరిహద్దులు చెరిగిపోయాయి. మూలాల్లోకి వెళ్లి కథలను పట్టుకోగలగాలి. ‘మగధీర’ అలాంటి సినిమానే. ‘లగాన్‌’ కూడా అలాంటి సినిమానే. కొరియాలో వచ్చిన ‘పారసైట్‌’ ఆ తరహా సినిమానే. మట్టి కథను, పోరాటాల కథలను చెప్పగలిగినప్పుడు ప్రతి ఒక్కరి నుంచి ప్రశంసలు వస్తాయి. గ్లోబల్‌ ఆడియన్స్‌ మన సినిమాలను భారతీయ సినిమాగా చూడాలి.

Updated Date - 2023-03-19T12:48:08+05:30 IST