Ramcharan: బోరున విలపించిన అభిమాని!
ABN , First Publish Date - 2023-02-13T19:29:40+05:30 IST
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ (Ramcharan)మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ చిన్నారి అభిమానిని కలిసి అతని కోరిక తీర్చారు. ఇటీవల రామ్‌చరణ్ అభిమానులను కలిశారు.
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ (Ramcharan)మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ చిన్నారి అభిమానిని కలిసి అతని కోరిక తీర్చారు. ఇటీవల రామ్‌చరణ్ అభిమానులను కలిశారు. సెక్యూరిటీ కారణాలతో కొంతమందిని లోపలికి అనుమతించలేదు. హైదరాబాద్‌లో చరణ్ ఫ్యాన్స్ మీటింగ్ ఉందని తెలుసుకున్న ఓ చిన్నారి (Child fan) అభిమాని వేదికకు చేరుకున్నాడు. ఫ్యాన్స్ మీట్(fans meet)లో బిజీగా ఉన్న చరణ్‌ని చూడగానే ఆ చిన్నారి అభిమాని కన్నీటి పర్యాంతమయ్యాడు. అభిమాన హీరోను చూడగానే బోరున విలపించారు. దీంతో అబ్బాయిని రామ్ చరణ్ (ramcharan) దగ్గరికీ పిలిచి మరీ వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత సెక్యూరిటీకి అతన్ని సురక్షితంగా ఇంటికి పంపించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రస్తుతం రామ్ చరణ్ తన తదుపరి చిత్రం ఆర్సీ15లో షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇటీవల హైదరాబాద్, కర్నూలులో షూటింగ్ జరుపుకున్న యూనిట్ తదుపరి షెడ్యూల్ కోసం వైజాగ్ చేరుకుంది. శంకర్ దర్శకత్వంలో దిల్ రాఝు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.