సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Ram Charan: పుట్టినరోజు పార్టీ ఫోటోస్ వైరల్

ABN, First Publish Date - 2023-03-28T16:23:03+05:30

నిన్న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా పరిశ్రమకి చెందిన కొంతమందిని రామ్ చరణ్ ఆహ్వానించి పార్టీ ఇచ్చారు. అలాగే ఈ వేడుకలో 'ఆర్.ఆర్.ఆర్' టీం సభ్యులను చిరంజీవి సత్కరించారు. ఇవి కాకుండా ఇంకా....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు నిన్న అంటే మార్చి 27 న అట్టహాసంగా జరిగింది. అభిమానులు చాలా చోట్ల రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. అదే విధంగా రామ్ చరణ్, చలన చిత్ర పరిశ్రమలోని కొంతమంది నటులకు, నిర్మాతలకు, దర్శకులకు పుట్టిన రోజు సందర్భంగా పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి పరిశ్రమ నుండి చాలామంది తరలివచ్చారు.

మెగ‌స్టార్ చిరంజీవి ఇంట్లో రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మంలో చ‌ర‌ణ్‌ను ఇష్ట‌ప‌డే నటులు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (Vijay Deverakonda), వెంకటేష్ (Venkatesh Daggubati) స‌హా రామ్ చ‌ర‌ణ్ చిన్న‌నాటి స్నేహితుడు రానా ద‌గ్గుబాటి (Rana Daggubati త‌న స‌తీమ‌ణి మిహిక‌తో క‌లిసి పాల్గొన్నారు. ఇంకా అక్కినేని నాగార్జున‌ (Akkineni Nagarjuna), అమ‌ల‌, నాగ చైత‌న్య‌, అఖిల్ (Akhil Akkineni) ఫంక్ష‌న్‌కి అటెండ్ అయ్యారు.

ఇంకా నటులు అడివి శేష్‌ (Adivi Sesh), నిఖిల్ సిద్ధార్థ్‌, వైష్ణ‌వ్ తేజ్‌, సాయిధ‌ర‌మ్ తేజ్‌, డైరెక్ట‌ర్ కృష్ణ వంశీ, నిర్మాత‌లు అల్లు అర‌వింద్‌, దిల్ రాజు (Dil Raju) త‌దిత‌రులు కూడా విచ్చేశారు.

రామ్ చ‌ర‌ణ్‌తో మంచి అనుబంధం ఉండే ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి (SS Rajamouli), కె.జి.య‌ఫ్ (KGF) సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌, (Prashanth Neel) డైరెక్ట‌ర్ సుకుమార్ (Sukumar) వంటి స్టార్ డైరెక్ట‌ర్స్ సెల‌బ్రేష‌న్స్‌లో పాల్గొన్నారు.

చిరంజీవి ఈ సందర్భంగా ఆస్కార్ గెలుచుహుకున్న 'ఆర్.ఆర్.ఆర్' (RRR) సినిమా దర్శకుడు రాజ‌మౌళి స‌హా RRR మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ ఎం.ఎం.కీర‌వాణి, నిర్మాత డి.వి.వి.దాన‌య్య‌, సినిమాటోగ్ర‌ఫర్ కె.కె.సెంథిల్ కుమార్‌, గాయకులూ ఎస్‌.ఎస్‌.కార్తికేయ‌, రాహుల్ సిప్లిగంజ్‌, కాల భైర‌వ లను సన్మానించారు.

కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) తన భర్త తో కలిసి ఈ బర్తడే పార్టీకి హాజరైంది. అప్పుడే అక్కడికి వచ్చిన దర్శకుడు కృష్ణ వంశీ ని చూసి వెంటనే తన భర్తకి పరిచయం చేసింది.

కృష్ణ వంశి తో కాజల్ అగర్వాల్ 'చందమామ' అనే సినిమా చేసింది. అందులో కాజల్ నటనని చాలామంది ప్రశంసించారు.

Updated Date - 2023-03-28T16:27:29+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!