సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

RamCharan - Vikram: న్యూ టాలెంట్స్‌ కోసం.. స్నేహితుల ప్రయత్నం!

ABN, First Publish Date - 2023-05-25T13:40:54+05:30

గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ తన సేహితుడు విక్రమ్‌తో కలిసి కొత్త ప్రొడక్షన్‌ హౌస్‌ ప్రారంభించారు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ విక్రమ్‌ (విక్కీ), రామ్‌ చరణ్‌ మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram charan) తన సేహితుడు విక్రమ్‌తో( UV Vjkram కలిసి కొత్త ప్రొడక్షన్‌ హౌస్‌ ప్రారంభించారు. యూవీ క (విక్కీ), రామ్‌ చరణ్‌ మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి పలు చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్స్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. (Ram charan New production house) ఇప్పుడు ‘వీ మెగా పిక్చర్స్‌’ పేరుతో కొత్త బ్యానర్‌ను ప్రారంభించారు. ఇప్పటికే రామ్‌ చరణ్‌ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పేరుతో సినిమాలు తీస్తున్నారు. 2017లో స్థ్థాపించిన ఈ సంస్థ ‘ఖైదీ నం.150’ వంటి హిట్‌ సినిమాలను నిర్మించింది. విక్కీతో కలిసి ప్రారంభించిన ‘వీ మెగా పిక్చర్స్‌’ బ్యానర్‌పై నూతన నటీనటులకు అవకాశం ఇవ్వనున్నారు. యంగ్‌ టాలెంటెడ్స్‌ని ప్రోత్సహించనున్నారు. ప్యాన్‌ ఇండియా చిత్రాలను తెరకెక్కించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటీవల కశ్మీర్‌లో జరిగిన జీ20 సదస్సులో భారతీయ చలన చిత్ర పరిశ్రమ తరఫున ప్రతినిధిగా హాజరయ్యారు రామ్‌చరణ్‌. ఆ సదస్సు ముగిసిన అనంతరం ఆయన ఓ ట్వీట్‌ చేశారు. భారతీయ సినిమా ఎంతో ప్రత్యేకమైనదని ట్వీట్‌లో పేర్కొన్నారు. జి20 వేదికగా తన ఆలోచనలను పంచుకునే అవకాశం కల్పించినందుకు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, జమ్మూ కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హాకు, బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌కు రామ్‌ చరణ్‌ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం చరణ్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమాలో నటిస్తున్నారు.

Updated Date - 2023-05-25T13:40:54+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!