సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Venkatesh - Ram charan: అమెరికాలో సందడి.. వెంకీ ‘నాటు నాటు వైరల్‌!

ABN, First Publish Date - 2023-02-27T14:50:09+05:30

ఇట్స్‌ నాటు నాటు టైమ్‌ చరణ్‌, (Its natu natu time) అవార్డులన్నీ చరణ్‌కే (ram charan) వచ్చాయి’ అంటూ సందడి చేశారు విక్టరీ వెంకటేశ్‌ (venkatesh video viral). ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉన్నారు. ఓ పెళ్లి నిమిత్తం అక్కడికి వెళ్లారు. మరోవైపు రామ్‌చరణ్‌ కూడా అక్కడే ఉన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఇట్స్‌ నాటు నాటు టైమ్‌ చరణ్‌, (Its natu natu time) అవార్డులన్నీ చరణ్‌కే (ram charan) వచ్చాయి’ అంటూ సందడి చేశారు విక్టరీ వెంకటేశ్‌ (venkatesh video viral). ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉన్నారు. ఓ పెళ్లి నిమిత్తం అక్కడికి వెళ్లారు. మరోవైపు రామ్‌చరణ్‌ కూడా అక్కడే ఉన్నారు. శుక్ర, శనివారాల్లో ఆయన ‘హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌’ (hollywood Critics associations) అవార్డ్‌ వేడుకలతోపాటు ‘గుడ్‌ మార్నింగ్‌ అమెరికా’ టెలివిజన్‌ టాక్‌ (Good morning America) షోతో బిజీగా గడిపారు. ఆ కార్యక్రమాల అనంతరం అమెరికాలో జరిగిన ఓ తెలుగింటి పెళ్లికి హాజరయ్యారు. అదేపెళ్లికి విక్టరీ వెంకటేశ్‌ కూడా హాజరయ్యారు. వీరిద్దరూ ఒకే స్టేజ్‌పై కలవడం సందడి నెలకొంది. వేదికపై చరణ్‌, వెంకీ మామ పక్కపక్కనే ఉండి హంగామా చేశారు. వెంకటేశ్‌ ‘నాటు నాటు’ పాటకు స్టెప్పులేసి సందడి చేశారు. మైక్‌ తీసుకుని చరణ్‌, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా గురించి మాట్లాడారు. ‘‘ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌’ బృందం అంతర్జాతీయ వేదికలపై అవార్డులు అందుకుంటూ బిజీగా ఉంది. ‘నాటు నాటు’ అంటూ మన అందర్నీ గర్వపడేలా చేస్తున్నావు, అన్ని అవార్డులు నీకే వస్తున్నాయి’ అని వెంకటేశ్‌ చరణ్‌ను ఉద్దేశించి మాట్లాడారు. దీనికి చరణ్‌ కూడా స్పందించి ‘థ్యాంక్యూ వెంకీ అన్నా’ అని అన్నారు. వీరిద్దరూ వేదికపై మాట్లాడుకుంటున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Updated Date - 2023-02-27T14:50:10+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!