RamCharanUpasana: క్యూట్ కపుల్ రామ్‌చ‌ర‌ణ్‌, ఉపాస‌న ఫోటోస్ వైరల్, ఎందుకంటే...

ABN , First Publish Date - 2023-04-22T10:27:30+05:30 IST

రామ్ చరణ్, ఉపాసన దంపతులు టాలీవుడ్ లో విరుల్ అవుతున్న కపుల్. ఇప్పుడు తమ జీవితాల్లోకి రాబోయే బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్ కూడా సినిమాలకి బ్రేక్ చెప్పి కొన్ని నెలల పాటు ఉపాసనతో వుండనాలి నిర్ణయించుకున్నాడని కూడా తెలిసింది. అయితే వీళ్ళు మళ్ళీ వైరల్ అయ్యారు ఎందుకంటే...

RamCharanUpasana: క్యూట్ కపుల్ రామ్‌చ‌ర‌ణ్‌, ఉపాస‌న ఫోటోస్ వైరల్, ఎందుకంటే...

రామ్ చ‌ర‌ణ్‌ (Ram Charan), ఆయ‌న స‌తీమ‌ణి ఉపాస‌న‌తో (Upasana Kamineni Konidela) క‌లిసి రీసెంట్‌గా ఆస్కార్ అవార్డ్స్ (Oscar Awards) సంద‌ర్భంగా ఒక యూట్యూబ్ ఛానల్ తో క‌లిసి చేసిన వీడియో, వారి అధికారిక యూ ట్యూబ్ చానెల్లో సరికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసింది.

upasanakamineni1.jpg

ఆస్కార్‌కి రెడీ అవుతోన్న 'ఆర్ఆర్ఆర్' #RRR స్టార్ రామ్ చ‌ర‌ణ్ పేరుతో వీడియోను యూ ట్యూబ్ చానెల్‌లో పోస్ట్ చేయ‌గా దానికి 6.6 మిలియ‌న్స్ కంటే ఎక్కువ వ్యూస్ వ‌చ్చాయి. ఆ చానెల్‌లో అత్య‌ధిక వ్యూస్ సాధించిన వీడియో ఇదే కావ‌టం విశేషం.

upasanakamineni2.jpg

'ఆర్ఆర్ఆర్' #RRR సినిమాలోని నాటు నాటు (Naatu Naatu) పాట‌ ఆస్కార్ అవార్డ్ (Oscar Award) గెలుచుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ అవార్డ్ రావ‌టం అనేది రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న #Oscars2023 జీవితాల్లో ఎంతో మ‌ధుర‌మైన క్ష‌ణాల‌ని చెప్పొచ్చు.

upasanakamineni5.jpg

అలాంటి గొప్ప అవార్డుల కార్య‌క్ర‌మానికి వెళ్లే సంద‌ర్భంలో రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌నల‌పై ఈ వీడియోను చిత్రీక‌రించారు. ఉపాస‌న‌కు ఆమె గ‌దిలో హెయిర్ స్ప్రేను స్ప్రే చేసే మూమెంట్‌తో స్టార్ట్ అయ్యే ఈ వీడియో వారి వ్య‌క్తిగ‌త జీవితాల‌కు సంబంధించిన కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను కూడా తెలియ‌జేసేలా చేసింది. ఇది చాలా మందిని ఆక‌ట్టుకుంది.

upasanakamineni3.jpg

రామ్ చ‌ర‌ణ్ ఆస్కార్ వేడుక‌కి వెళ్లే స‌మ‌యంలో త‌యారైన విధానం చూస్తే ఆయ‌న‌లోని ఆక‌ర్ష‌ణ మ‌రింత గొప్ప‌గా, సున్నితంగా ప్ర‌స్పుట‌మైంది. దీంతో ఆయ‌న‌పై ఉన్న ఇష్టం మ‌రింత పెరిగింద‌న‌టంలో సందేహం లేదు. మ‌రో వైపు ఉపాస‌న చ‌క్క‌టి చీర‌క‌ట్టుతో క‌న‌ప‌డుతుంది.

upasanakamineni4.jpg

రామ్ చ‌ర‌ణ్‌కి ఉన్న ఆద‌ర‌ణ‌కి ఆయ‌న వ్య‌క్తిగ‌త జీవితంలోని విశేషాల‌ను తెలుసుకుని ఆయ‌న అభిమానులు ఇంకెంత‌గా ఆక‌ర్షితుల‌య్యార‌నే దానికి ఈ వీడియోకి వ‌చ్చిన మిలియ‌న్ వ్యూస్‌ స్పంద‌న ఓ నిద‌ర్శ‌నం. చ‌ర‌ణ్‌లోని అంకిత భావం, స‌హ‌జ‌త్వం, మంచి లుక్స్ అన్ని క‌లిసి త‌న‌ని గొప్ప శ‌క్తిగా మార్చింది.

Updated Date - 2023-04-22T10:27:30+05:30 IST