Rakul Preeth singh: పరువాల విందుకు పిచ్చెక్కిపోవలసిందే!

ABN , First Publish Date - 2023-05-29T16:33:09+05:30 IST

ఐఫా రెడ్‌ కార్పెట్‌పై రకుల్‌ప్రీత్‌సింగ్‌ హోయలు ఒలికించింది. హాట్‌ హాట్‌ ఫోజులకు ఫోజ్‌ ఇచ్చి కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేసింది. అబుదాబిలో జరిగిన ఇంటర్‌నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్చు వేడుకలో సందడి చేసింది.

Rakul Preeth singh: పరువాల విందుకు పిచ్చెక్కిపోవలసిందే!

ఐఫా రెడ్‌ కార్పెట్‌పై రకుల్‌ప్రీత్‌సింగ్‌ *Rakul preeth singh) హోయలు ఒలికించింది. హాట్‌ హాట్‌ ఫోజులకు ఫోజ్‌ ఇచ్చి కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేసింది. అబుదాబిలో జరిగిన ఇంటర్‌నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ (IIFA) అవార్డ్చు వేడుకలో సందడి చేసింది. వయ్యారాలు ఒలకబోస్తూ అందాలను ప్రదర్శించింది. రకుల్‌ పరువాల విందుకు పిచ్చెక్కిపోవలసిందే అంటున్నారు నెటిజన్లు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. బ్లాక్‌ అవుట్‌ఫిట్‌లో హాట్‌గా స్కిన్‌ షో చేసిన ఫోటోలు తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. స్టార్‌ సెలబ్రిటీలు ఎంతోమంది వావ్‌ అనేలా ప్రదర్శనలతో మెప్పించినా వారిలో రకుల్‌ విశేషంగా కనిపించారు. ఈ వేడుకలో హాట్‌ బాంబ్‌ నోరా ఫతేహీ, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, కృతీసనన్‌తోపాటు ఫిట్‌ నెస్‌ క్యూట్‌ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఓ పాటకు స్టెప్పులేశారు. ఓల్‌ ఈజ్‌ గోల్డ్‌ (old is gold) అన్నట్లుగా బ్లాక్‌ అండ్‌ వైట్‌ చిత్రాలకు నివాళిగా అద్భుతమైన ప్రదర్శనతో అలరించింది రకుల్‌(Rakul). తన డ్యాన్స్‌ ప్రదర్శనలో గొడుగు పట్టుకుని అందంగా నడుస్తూ క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో వేదిక ముందున్న ఆహుతులు వావ్‌ అనిపించేలా చేసింది. ప్రస్తుతం రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ బాలీవుడ్‌ చిత్రాలపై దృష్టిసారిస్తున్నారు. ‘కొండపొలం’ చిత్రం తర్వాత ఆమె మరో తెలుగు సినిమాకు సైన్‌ చేయలేదు. ప్రస్తుతం తమిళంలో ‘ఇండియన్‌ -2(Indian 2), ‘ఆయలాన్‌’ (ayalaan)చిత్రాలతో బిజీగా ఉన్నారు రకుల్‌.

Updated Date - 2023-05-29T16:33:09+05:30 IST