Rakul preeth singh: ప్యాన్‌ ఇండియా అంటే అర్థం తెలీదు!

ABN , First Publish Date - 2023-01-21T14:38:11+05:30 IST

కొండపొలం’ చిత్రం తర్వాత రకుల్‌ మరో తెలుగు సినిమా అంగీకరించలేదు. మాతృభాష హిందీకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, 2022 క్యాలెండర్‌ మొత్తం హిందీ చిత్రాలకే కేటాయించింది రకుల్‌.

Rakul preeth singh: ప్యాన్‌ ఇండియా అంటే అర్థం తెలీదు!

‘కొండపొలం’ చిత్రం తర్వాత రకుల్‌ (Rakul preeth singh) మరో తెలుగు సినిమా అంగీకరించలేదు. మాతృభాష హిందీకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, 2022 క్యాలెండర్‌ మొత్తం హిందీ చిత్రాలకే కేటాయించింది రకుల్‌. ఆరు హిందీ చిత్రాలతో గత ఏడాది బిజీగా గడిపిన ఆమె ప్రస్తుతం మరో రెండు హిందీ చిత్రాల్లో నటిస్తున్నారు. తాజాగా రకుల్‌ ఓ ఇంటర్వ్యూలో (Rakul comments) ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనకు ప్యాన్‌ ఇండియా (i dont know meaning of pan india) అంటే అర్థం తెలియదని, అదొక కమర్షియల్‌ టర్మ్‌ (pan india is commercial term )అనుకుంటున్నానని రకుల్‌ అన్నారు. తన కొత్త సినిమా ‘ఛత్రీవాలీ’ సినిమా ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్య్యలు చేశారు. ‘చాలామంది నటీనటులు మల్టీ లాంగ్వేజ్‌ల్లో పని చేశారు . మీరు కూడా అలాగే కొనసాగుతున్నారు. కొత్తగా ప్యాన్‌ ఇండియా అనే పదం ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది’ అని యాంకర్‌.. అడగగా ఆమె ఇలా స్పందించారు. ‘‘మనకు ఉన్న ఒక్కటే ఇండియా. ఇండియా అంటే ఇండియానే. కరోనా తర్వాత ఓటీటీకి ఆదరణ పెరిగింది. విభిన్న కథా చిత్రాలను చూేసందుకు ఆసక్తి చూపుతున్నారు. కొరియన్‌ వెబ్‌సిరీస్‌లు ఎక్కువగా చూస్తున్నారు. అలాగే పంజాబీ, బెంగాలీ, తెలుగు, తమిళం.. ఇలా రీజనల్‌ సినిమాలు జాతీయ స్థాయిలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల్ని అలరిస్తున్నాయి. ప్యాన్‌ ఇండియా అనే పదం ఉంటే పెద్ద సినిమా అని భావిస్తున్నారు. ఆ ట్యాగ్‌ ఉంటే తెలుగు, తమిళం, హిందీ.. ఇలా అన్ని భాషల ప్రేక్షకులు సినిమా చూసేందుకు వస్తారు. అదొక కమర్షియల్‌ కోణం అని అనుకుంటున్నా. సినిమాకు భాష కంటే ఎమోషన్‌ ముఖ్యం అనేది నా అభిప్రాయం. ఓ నటిగా భాషలోనైనా మంచి కథలు ఎంపిక చేసుకుని ప్రేక్షకులను అలరించాలనుకుంటున్నా’’ అని రకుల్‌ చెప్పారు. బాలీవుడ్‌ సినిమాలు ఎందుకు సక్సెస్‌ కాలేకపోతున్నాయన్న ప్రశ్నకు రకుల్‌ స్పందించారు.

‘‘సినిమా విషయంలో ఏదన్నా తప్పు జరిగితే ఫలానా నటుడు, ఫలానా నటి చెడ్డవారని, బాలీవుడ్‌ చిత్రాలు విజయం అందుకోలేకపోతున్నాయని ఎవరో ఒకరు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అలాంటి కామెంట్లు తీవ్ర చర్చకు దారి తీస్తాయి. బాగోలేని సినిమాను ప్రశంసించమని నేను చెప్పను. ఏదైనా చిత్రం సరిగా ఆడకపోతే దానికి చాలా కారణాలు ఉంటాయనే విషయాన్ని కామెంట్‌ చేసేవారు తెలుసుకోవాలి’’ అన్నారు. రకుల్‌ కథానాయకిగా తేజాస్‌ డియోస్కర్‌ దర్శకత్వం వహించిన ‘ఛత్రీవాలీ’ ‘జీ 5’ ఓటీటీలో ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకొచ్చింది.

Updated Date - 2023-01-21T14:38:53+05:30 IST