Rajinikanth: రజనీకాంత్ నిజాలే మాట్లాడుతాడు: జగపతి బాబు

ABN , First Publish Date - 2023-05-03T15:43:11+05:30 IST

'రామబాణం' ప్రచారాల్లో భాగంగా జగపతి బాబు ఆ సినిమాలో తన పాత్ర గురించి మాట్లాడేరు, అలాగే ఇప్పుడు వైసీపీ వాళ్ళు రజినీకాంత్ మీద ఏవేవో అబాండాలు వేసి, సిల్క్ స్మిత తో లింక్ పెట్టారు. దాని మీద కూడా జగపతి బాబు ఏమన్నాడు అంటే...

Rajinikanth: రజనీకాంత్ నిజాలే మాట్లాడుతాడు: జగపతి బాబు

జగపతి బాబు (Jagapathi Babu) ఒక విలక్షణ నటుడు. అటు దక్షిణాది భాషల్లో బిజీ గా ఉంటూ, ఈమధ్య హిందీ చిత్రాలలో కూడా ఎక్కువ కనిపిస్తున్నాడు. ఇప్పుడు 'రామబాణం' #RamaBanam అనే సినిమాలో గోపీచంద్ (Gopichand) తో కలిసి నటిస్తున్నాడు జగపతిబాబు. దర్శకుడు శ్రీవాస్ (Sriwaas), గోపీచంద్ తో ఇంతకు ముందు 'లక్ష్యం' అనే సినిమాలో నటించాడు జగపతి బాబు. ఇప్పుడు ఎక్కువగా హారర్, యాక్షన్ , థ్రిల్లర్స్ వస్తున్నాయి, కానీ ఫ్యామిలీ డ్రామా వచ్చి చాలా కాలమైంది. ఈ 'రామబాణం'లో అన్నదమ్ముల కాన్సెప్ట్ అద్భుతంగా కుదిరింది.

jagapathibabu.jpg

తాను గతంలో చేసిన 'శివరామరాజు' కూడా కూడా అన్నదమ్ముల కథే అని చెపుతూ ఆ సినిమా చూసి విడిపోయిన కొన్ని కుటుంబాలు కలిశాయి. ఇప్పుడు 'రామబాణం' కూడా ఒక మంచి ఉద్దేశంతో చేసిన సినిమా, హాయిగా ఓ మంచి సినిమా చూసామనే అనుభూతిని కలిగిస్తుంది ఇది అని చెప్పుకొచ్చాడు జగపతి బాబు.

దాదాపు 70కి పైగా క్యారెక్టర్ రోల్స్ చేసిన జగపతి బాబు అందులో చెప్పుకోవడానికి ఏడెనిమిది సినిమాలే వున్నాయి అన్నాడు. తనని కొన్ని సినిమాల్లో సరిగ్గా వాడుకోలేదని చెప్పాడు. ఈ 'రామబాణం' ఇది అన్నదమ్ముల కథ నాది, గోపీచంద్ ఇద్దరి పాత్రలు పండితేనే సినిమా ఆడుతుందని గోపిచంద్ ఖచ్చితంగా చెప్పాడు, అందుకు గోపీచంద్ ని మెచ్చుకోవాలి. సెంటిమెంట్ తగ్గిపోయిన రోజుల్లో ఇలాంటి కథలు రావడం చాలా అవసరమని అనుకుంటున్నాను అని చెప్పాడు జగపతి బాబు.

ఈమధ్య విడుదల అయిన సల్మాన్ ఖాన్ (SalmanKhan) సినిమా 'కిసి కా భాయ్ కిసి కా జాన్' (KisiKaBhaiKisiKaJaan) లో కూడా జగపతి బాబు ఒక ముఖ్య పాత్ర పోషించాడు. ఈ సినిమా వలన పేరు చాలా వచ్చింది అని, అందులో సల్మాన్ ఖాన్ తో చేసిన సినిమాతో డౌట్ లేకుండా వచ్చింది. ఇప్పుడు తనకు బాలీవుడ్ నుంచి చాలా అవకాశాలు వున్నాయి, అని చెప్పాడు.

jagapathibabu1.jpg

రజనీకాంత్ (Rajinikanth) ఈమధ్య ఎన్టీఆర్ (NTR) శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనటం, ఎన్టీఆర్ గురించి, చంద్రబాబు (Chandrababu) గురించి మాట్లాడటం, ఆ తరువాత, వైసీపీ వాళ్ళు అతనికి సిల్క్ స్మిత (SilkSmitha) తో లింక్ పెట్టడం గురించి అడిగినప్పుడు, ఆ విషయం తెలీదు, కానీ "రజనీకాంత్ ఎప్పుడు మాట్లాడినా చక్కగా మాట్లాడతాడు, అతను మాట్లాడే విధానం పెర్ఫెక్ట్, అలాగే నిజాలు మాట్లాడతాడు," అని చెప్పాడు. రజనీకాంత్ వందశాతం రైట్ అని చెప్పాడు జగపతి బాబు. చక్కగా, మాట్లాడతాడు, నిజాలు మాట్లాడతాడు అని రజని ని ప్రశంసించాడు జగపతి బాబు.

Updated Date - 2023-05-03T15:43:11+05:30 IST