RRR - Oscar Committee: ఆనందంలో జక్కన్న.. అందరికీ శుభాకాంక్షలు!

ABN , First Publish Date - 2023-06-29T15:59:26+05:30 IST

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి పని చేసిన బృందంలో ఆరుగురికి ఆస్కార్‌ కమిటీలో చోటు దక్కించుకోవడం పట్ల దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారికి శుభాకాంక్షలు తెలిపుతూ ట్వీట్‌ చేశారు. ఆయన దర్శకత్వంలో తారక్‌, రామ్‌చరణ్‌ కీలక పాత్రధారులుగా రూపొందిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందడమే కాకుండా ఆస్కార్‌ అవార్డును అందుకొంది.

RRR - Oscar Committee: ఆనందంలో జక్కన్న.. అందరికీ శుభాకాంక్షలు!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR)చిత్రానికి పని చేసిన బృందంలో ఆరుగురికి ఆస్కార్‌ కమిటీలో చోటు దక్కించుకోవడం పట్ల దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి (SS Rajamouli Happy) ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారికి శుభాకాంక్షలు తెలిపుతూ ట్వీట్‌ చేశారు. ఆయన దర్శకత్వంలో తారక్‌(Ntr), రామ్‌చరణ్‌ (Ram charan) కీలక పాత్రధారులుగా రూపొందిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందడమే కాకుండా ఆస్కార్‌ అవార్డును అందుకొంది. తాజాగా ఈ చిత్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది. ‘ద అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌’ కొత్తగా ఆస్కార్‌ కమిటీలో 398 మందికి సభ్యత్వం కల్పించింది. ఇందులో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌కు చెందిన స్టార్‌ హీరోలు రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌తోపాటు సంగీత దర్శకుడు కీరవాణి(Keeravani), గేయ రచయిత చంద్రబోస్‌, (Chandra bose)ఛాయగ్రాహకుడు కె.కె.సెంథిల్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌ సాబు సిరిల్‌ ఆస్కార్‌ కమిటీలో స్థానం దక్కించుకున్నారు. (RRR Team in Oscar committee)

ఈ మేరకు రాజమౌళి ట్వీట్‌ చేశారు. ‘‘ఈ ఏడాది ఆస్కార్‌ కమిటీలోకి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం నుంచి ఆరుమంది సభ్యులకు ఆహ్వానం అందడం చాలా గర్వంగా ఉంది. తారక్‌, చరణ్‌, పెద్దన్న (కీరవాణి), చంద్రబోస్‌, సెంథిల్‌, సాబు సిరిల్‌ అందరికీ అభినందనలు తెలుపుతున్నా. భారతీయ చిత్ర పరిశ్రమలో ఈ అహ్వానం అందిన ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు’’ అని రాజమౌళి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అయితే ఈ ప్రకటన రావడంతో సోషల్‌ మీడియా వేదికగా ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. రాజమౌళికి కమిటీలో స్థానం దక్కలేదని అభిమానులు నిరాశ చెందుతున్నారు.

Updated Date - 2023-06-29T15:59:57+05:30 IST