Rahul Ramakrishna: రైలు ప్రమాదంపై కామెడీ.. విషయం తెలియదని క్షమాపణ!

ABN , First Publish Date - 2023-06-04T12:32:34+05:30 IST

సోషల్‌ మీడియా వేదికగా కామెంట్లు చేయడం, సింపుల్‌గా ‘సారీ’ అని ఓ ట్వీట్‌ వేయడం కొందరికి హాబీగా మారిపోయింది. వ్యంగ్యంగా ప్రవర్తించడానికి సమయం, సందర్భం లేకుండా పోయుంది అనడానికి ఓ కమెడీయన్‌ చేసిన ట్వీట్‌ కారణమైంది. ఈ రైలు ప్రమాదం ఘనటపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. అతనెవరో కాదు.. రాహుల్‌ రామకృష్ణ.

Rahul Ramakrishna:  రైలు ప్రమాదంపై కామెడీ.. విషయం తెలియదని క్షమాపణ!

సోషల్‌ మీడియా వేదికగా కామెంట్లు చేయడం, సింపుల్‌గా ‘సారీ’ (Simple sorry) అని ఓ ట్వీట్‌ వేయడం కొందరికి హాబీగా మారిపోయింది. వ్యంగ్యంగా ప్రవర్తించడానికి సమయం, సందర్భం లేకుండా పోయుంది అనడానికి ఓ కమెడీయన్‌ చేసిన ట్వీట్‌ కారణమైంది. శుక్రవారం రాత్రి ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం (Odisha train tragedy) గురించి అందరికీ తెలిసింది. 288 మంది మృతిచెందారు. 1175 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. కొందరి పరిస్థితి విషయంగా ఉంది. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఈ ఘటనపై సినీ, రాజకీయ ప్రముఖులు, విదేశీయులు దిగ్ర్బాంతిని వ్యక్తం చేస్తున్నారు. మృతిచెందిన వారికి సంతాపం తెలుపుతున్నారు. సినీ పరిశ్రమ నుంచి చిరంజీవి నుంచి అగ్ర హీరోలతోపాటు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ వరకూ ఈ ఘటనపై సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చేలా ట్వీట్లు చేశారు. టాలీవుడ్‌కి చెందిన ఓ హాస్య నటుడు మాత్రం ఈ రైలు ప్రమాదం ఘనటపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. అతనెవరో కాదు.. రాహుల్‌ రామకృష్ణ. (Rahul Ramakrishna)

శుక్రవారం జరిగిన రైలు ప్రమాదం అనంతరం రాహుల్‌ చేసిన ట్వీట్‌ చర్చనీయాంశమైంది. ‘సైలెంట్‌’ అనే హాలీవుడ్‌ సినిమాలోని నటుడు బస్టర్‌ కీట్‌ ట్రైన్‌ ముందు చేసే విన్యాసాలకి సంబంధించిన వీడియో షేర్‌ చేశాడు. దీంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రైలు ప్రమాదం (Odissa Train accident) ఎంతమంది కడుపు కోతకు కారణమైందో తెలుసా? నువ్వేమో ఇలాంటి కామెడీ చేస్తున్నావా? అని కొందరు. నువ్వు అసలు మనిషివేనా.. ఇది కామెడీ చేేస సమయమా..? అని మరికొందరు ట్రోల్‌ చేశారు. నెటిజన్లు ట్వీట్లతో యుద్ధం చేయడంతో రాహుల్‌ వెంటనే ఆ ట్వీట్‌ను డిలీట్‌ చేసి క్షమాపణ కోరారు. ‘‘నేను అంతకుముందు వేసిన ట్వీట్‌ గురించి క్షమాపణ చెప్తున్నాను. ఈ ఘటన గురించి నాకు తెలియదు. నైట్‌ నుంచి స్ర్కిప్ట్‌ రాసుకుంటూ కూర్చున్నాను.. తప్పు జరిగింది.. ఒట్టేసి చెప్తున్నా ఇది కావాలని చేసింది కాదు ’’ అని చెప్పుకొచ్చాడు. అక్కడితో నెటిజన్లు శాంతించారు. ‘మిమ్మల్ని విమర్శించాలని కాదు. కానీ మీ నిజాయంతీని మెచ్చుకుంటున్నాం. అయితే జరిగిన ఘటన తీవ్రత గురించి మేం మాట్లాడాము’’ అని ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు.

Updated Date - 2023-06-04T12:33:47+05:30 IST