Raghava Lawrence: చేసేది.. చేయించేది.. అన్నీ ఆయనే.. నేను పనొడిని మాత్రమే!

ABN , First Publish Date - 2023-04-11T22:53:14+05:30 IST

నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్‌ లారెన్స్‌ రాఘవ సేవా కార్యక్రమాల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. లారెన్స్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా ఆశ్రయం లేని ఎంతో చిన్నారులను చేరదీసి పోషిస్తున్నారు.

Raghava Lawrence: చేసేది.. చేయించేది.. అన్నీ ఆయనే.. నేను పనొడిని మాత్రమే!

నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్‌ లారెన్స్‌ రాఘవ (Raghava Lawrence) సేవా కార్యక్రమాల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. లారెన్స్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ (Lawrence Charitable trust) ద్వారా ఆశ్రయం లేని ఎంతో చిన్నారులను చేరదీసి పోషిస్తున్నారు. చదువు చెప్పిస్తున్నారు. గుండె సంబంధించి (Heart operations) సమస్యలతో ఇబ్బంది పడుతున్న చాలా మంది చిన్నారులకు గుండె ఆపరేషన్‌ చేయించారు. గతంలో.. గుండె సమస్యతో బాధపడుతున్న 145 మంది చిన్నారులకు శస్త్ర చికిత్స చేయించిన సంగతి తెలిసిందే. ఇలా ఆయన చేసే సహకారాలెన్నో. తాజాగా మరోసారి ఆయన ఉదారతను చాటుకున్నారు లారెన్స్‌. ట్రస్ట్‌ ద్వారా ఇప్పటికే ఎంతోమందికి సాయం అందించిన ఆయన ఇప్పుడు 150 Adopted 150 childrens) మంది చిన్నారులను దత్తత తీసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. ఈ చిన్నారులకు నాణ్యమైన విద్యను అందించేలా కృషి చేస్తానన్నారు. అందుకు అభిమానులు, సినీ అభిమానుల ఆశీస్సులు కోరారు. తన తాజా చిత్రం ‘రుద్రన్‌’ ప్రీ రిలీజ్‌ వేడుకలో ఆ చిన్నారులతో దిగిన ఫొటోను ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ఆయన చేస్తున్న సేవలకు నెటిజన్లు, ఫ్యాన్స్‌ అభినందిస్తున్నారు. చెన్నైలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆర్థిక సమస్య కారణంగా చదువుకు దూరమవుతున్నా, గుండెకు సంబంఽధించిన సమస్యలు ఉన్నా లారెన్స్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ను సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సేవల చేసే విషయంలో రాఘవేంద్ర స్వామి తనను ముందుకు నడిపిస్తున్నాడని చెప్పారు. (Rudran movie)

‘మా అమ్మా ఎప్పుడు ఓ మాట చెబుతుంటారు. తెరపైనే కాకుండా నిజజీవితంలో కూడా హీరోగా ఉండాలని చెబుతుంది. స్ర్కీన్‌లో మీద హీరోగా వచ్చిన వాళ్లు వెళ్లిపోతారు. కానీ రియల్‌ హీరోగా ఉన్నవాళ్లు వారు చనిపోయిన తరువాత కూడా హీరోలుగా అందరి గుండెల్లో స్థానం సంపాదించుకుంటారు అని చెప్పిన అమ్మకు థ్యాంక్స్‌. నేను చేస్తున్న సహాయ కార్యక్రమాల ముందు నేను చేస్తున్నాను అని అనుకున్నాను. కానీ దేవుడు నన్నొక పని మనిషిగా పెట్టుకుని ఆయన చేస్తున్నాడని వయసు పెరిగేకొద్ది తెలుసుకున్నాను. నేను మీకు ఒక పని మనిషిగా పని చేయడానికి ఉన్నానని మరచిపోవద్దు. ఎవరికి ఏ ఆపద ఉన్న ఏ సమయంలోనైనా నన్ను అడగొచ్చు. మీరు కొనే ఒక్కొక్క టికెట్‌ వల్లనే నేను ఈ రోజు సంతోషంగా ఇలాంటి స్థాయిలో ఉంటూ కారులో తిరుగుతున్నాను. నాలుగు సంవత్సరాలుగా సినిమా చేయకపోయినా మరచిపోకుండా నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు ధన్యవాదాలు’’ అని అన్నారు.

లారెన్స్‌ హీరోగా కతిరేశన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘రుద్రన్‌’ ఈ నెల 14న విడుదల కానుంది. మరోవైపు. ‘చంద్రముఖి 2’లో నటిస్తున్నారు. వాసు దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ కీలక పాత్ర పోషించారు. (Chandramukhi 2)

Updated Date - 2023-04-11T22:56:43+05:30 IST