రాధిక జాతికి చెందిన ఆడపడుచువి నువ్వు, నేను నీకు ఎలా సహాయపడగలను...

ABN , First Publish Date - 2023-11-27T17:06:30+05:30 IST

సిద్ధూ జొన్నలగడ్డ ఈసారి అనుపమ పరమేశ్వరన్ తో జోడీ కట్టాడు 'టిల్లు స్క్వేర్' సినిమా కోసం. ఇది 'డీజే టిల్లు' సినిమాకి సీక్వెల్, అందుకే ప్రాచుర్యం పొందిన రాధిక పాత్రని ఈ సీక్వెల్ లో కూడా వదలలేదు. పాట కూడా 'రాధికా... రాధికా... ' అనే సాగుతుంది. ఈ పాట కూడా హిట్ అవుతుంది అనటంలో సందేహం లేదు.

రాధిక జాతికి చెందిన ఆడపడుచువి నువ్వు, నేను నీకు ఎలా సహాయపడగలను...
A scene from Tillu Square

సిద్ధూ జొన్నలగడ్డ (SiddhuJonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (AnupamaParameshwaran) జంటగా నటిస్తున్న 'టిల్లు స్క్వేర్' #TilluSquare సినిమానుండి ఇంకో పాట ఈరోజు విడుదలైంది. అయితే మామూలుగా పాట మాత్రమే విడుదల చేస్తారు, కానీ ఈ పాటతో పాటు ఒక డైలాగ్ సన్నివేశం కూడా విడుదల చేశారు. సిద్ధూ, అనుపమని 'చెప్పు రాధికా నేను నీకు ఎలా సహాయ పడగలతాను, ఈసారి నా కొంప ఎలా ముంచబోతున్నావ్' అని అడిగితే దానికి అనుపమ 'నా పేరు రాధిక కాదు, లిల్లి', అని చెపుతుంది.

ఈ సినిమా 'డీజే టిల్లు' కి సీక్వల్ గా వస్తున్న సినిమా కావటంతో, ఈ సినిమాకి ఆ సినిమాకి కొంత కనెక్షన్ చూపే విధంగా ఈ సంభాషణ ఉంటుంది. ఈ సన్నివేశంలో అనుపమ తన పేరు లిల్లి అని చెపుతుంది. "నీ పేరు లిల్లీ ఏమో గానీ, నువ్వు మనిషివైతే హండ్రెడ్ పెర్ సెంట్ రాధికవి. ఒక రాధిక జాతికి సంబందించిన ఆడపడుచువి నువ్వు," అని చెపుతూ రాధికా ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీలో స్టూడెంట్స్ మీరు. అంటూ ఈ సినిమాకి ముందు విడుదలైన 'డీజే టిల్లు' గురించి కూడా పరోక్షంగా ప్రస్తావన చేసాడు టిల్లు.

anupamasiddhu.jpg

టిల్లు లాంటి లప్పగాళ్ళు ఏడున్నారా, ఎవర్ని అవులాగాడిని చేద్దామా అని చూస్తారు అంటూ మీ సీనియర్ ని కలిశా, చాలా రాగింగ్ చేసింది నన్ను, అయితే బాగా ఎంజాయ్ చేశాను నేను అని అంటూ ఇప్పటికీ దాని గురించి (డీజీ టిల్లు) మాట్లాడుతున్నారు అని పరోక్షంగా మొదటి పార్టు గురించి చెపుతాడు. టిల్లు వున్నంతకాలం రాధిక ఉంటుంది అని చెపుతూ ఈ పాట సాగుతుంది.

రాధికా... ముందుకా.. ఎనకకా.. కిందికా మీదికా... రాధికా... ముంచక.. తేల్చక.. ఆటలేందికా... అంటూ ఈ పాట చాలా హుషారుగా సాగుతోంది. ఈ పాట కూడా వైరల్ అవుతుంది అనటంలో సందేహం లేదు. ఎందుకంటే ఇది ఒక మసాలా పాటలా వుంది. సిద్ధూ కి బాగా సూట్ అయింది. అనుపమ కూడా చాలా అందంగా వుంది. ఇంతకు ముందు సినిమాలలో ఆమె లుక్స్ కి ఈ సినిమాలో లుక్స్ కి ఆమెలో తేడా కనిపిస్తోంది. ఈ సినిమాకి మల్లిక్ రామ్ దర్శకుడు.

Updated Date - 2023-11-27T17:06:31+05:30 IST