Radhika Sarathkumar - K VIshwanath: సెట్‌లో సరదా సన్నివేశం!

ABN , First Publish Date - 2023-02-03T16:23:49+05:30 IST

‘స్వాతిముత్యం’ సెట్‌లో కె.విశ్వనాథ్‌, రాధిక, కమల్‌హాసన్‌ మధ్య జరిగిన ఓ సరదా సన్నివేశాన్ని రాధిక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ సంగతులివి. ‘‘స్వాతిముత్యం’లో లలిత పాత్రకి నన్ను తీసుకున్నప్పుడు ఆశ్చర్యపోయాను.

Radhika Sarathkumar - K VIshwanath: సెట్‌లో సరదా సన్నివేశం!

‘స్వాతిముత్యం’(Swathi muthyam) సెట్‌లో కె.విశ్వనాథ్‌, రాధిక,(Radhika) కమల్‌హాసన్‌(kamalhaasan) మధ్య జరిగిన ఓ సరదా సన్నివేశాన్ని రాధిక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ సంగతులివి. ‘‘స్వాతిముత్యం’లో లలిత పాత్రకి నన్ను తీసుకున్నప్పుడు ఆశ్చర్యపోయాను. (Radhika about kamal haasan)అదే సమయంలో శివాజీ గణేశన్‌ గారితో నటించమని నా గురువు భారతీరాజా గారు అడిగారు. డేట్స్‌ క్లాష్‌ వచ్చింది... ఏ సినిమాలో నటించాలా... అని అయోమయానికి గురయ్యాను. కమల్‌తో ఫస్ట్‌ టైం... విశ్వనాథ్‌ గారి సినిమా అనగానే భారతీరాజా కూడా ఎంకరేజ్‌ చేసి పంపారు. మానిటర్‌, కేరవాన్స్‌ ఏమీ లేని రోజులవి. అందరం సమన్వయంతో సెట్స్‌ మీద పని చెయ్యాల్సిందే. మొదటిరోజున సన్నగా ఉన్న కమల్‌ని చూసి ఇంకా లావు అవ్వాలని విశ్వనాథ్‌ సూచించారు. బాగా తినమని చెప్పారు. బాక్సుల నిండా స్వీట్లు తెప్పించి పెట్టారు. రోజూ పొద్దుటే కమల్‌ అవన్నీ తినేవారు. మా క్యారెక్టర్ల గురించి విశ్వనాథ్‌ గారు వివరించిన తీరు నాకింకా నిన్న మొన్న చెప్పినట్టే ఉంది. ప్రతి ఫ్రేముని విశ్వనాథ్‌ గారు ఎంతో ప్రేమిస్తారు. అయితే ‘స్వాతిముత్యం’ ఇంత పెద్ద హిట్‌ అవుతుందని ఊహించలేదు’’ అని రాధిక అన్నారు.

Updated Date - 2023-02-03T16:23:50+05:30 IST