Pushpa 2: మారేడుమిల్లి కాదు, RFCలో అవుతున్న షూటింగ్

ABN , First Publish Date - 2023-06-17T13:34:55+05:30 IST

అల్లు అర్జున్, సుకుమార్ 'పుష్ప 2' సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. అల్లు అర్జున్ తో పారు మరికొందరు ఆర్టిస్టుల మీద రాత్రిపూట కొన్ని పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టుగా తెలిసింది.

Pushpa 2: మారేడుమిల్లి కాదు, RFCలో అవుతున్న షూటింగ్
Pushpa 2

అల్లు అర్జున్ (AlluArjun), సుకుమార్ (Sukumar) కాంబినేషన్ లో వస్తున్న 'పుష్ప 2' #Pushpa2 షూటింగ్ జరుగుతోంది. రష్మిక మందన్న (RashmikaMandanna) ఇందులో కథానాయికగా నటిస్తోంది. అయితే ఈమధ్య ఈ సినిమా మారేడుమిల్లి (Maredumilli)లో షూటింగ్ జరుపుకుంటోంది అని ఒక వీడియో వైరల్ అయింది. అయితే అది మారేడుమిల్లి కాదని యూనిట్ సభ్యులు తెలియచేసారు. ఆ షూటింగ్ ఇక్కడే హైదరాబాద్ లో రామోజీ ఫిలిం సిటీ (RFC)లో జరిగింది అని తెలిసింది.

pushpatherule.jpg

దర్శకుడు సుకుమార్ అసలు కాళీ లేకుండా ఒకదాని తరువాత ఒకటి 'పుష్ప 2' #Pushpa2 సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఫహాద్ ఫాజిల్ (FahadhFaasil) , బ్రహ్మజీ (Brahmaji) ఇంకా మరికొందరు ఆర్టిస్టుల మీద మారేడుమిల్లిలో షూటింగ్ చేసాడు. తరువాత హైదరాబాద్ వచ్చి అల్లు అర్జున్ మీద ఒక పోరాట సన్నివేశం చిత్రీకరించాడు. మళ్ళీ మారేడుమిల్లి వెళ్లి మిగతా సన్నివేశాలు పూర్తి చేశారు. ఇప్పుడు మళ్ళీ హైద్రాబాద్లో అల్లు అర్జున్, అనసూయ (Anasuya), సునీల్ (Sunil), రావు రమేష్ (RaoRamesh), మరికొందరు ఆర్టిస్టుల మీద కొన్ని సన్నివేశాలు తీస్తున్నారని తెలిసింది.

pushpa2sukumar2.jpg

అయితే ఈ షూటింగ్ పగలు కాకుండా రాత్రిపూట జరుగుతోందని తెలిసింది. తెల్లవారు జాము 4.40 గంటలవరకు షూటింగ్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఇది కొన్ని రోజులు ఇక్కడే కంటిన్యూ అవొచ్చు అని కూడా అంటున్నారు. రెండో పార్టులో కూడా ఒక స్పెషల్ సాంగ్ ఉండొచ్చు అని కూడా తెలుస్తోంది.

Updated Date - 2023-06-17T13:35:00+05:30 IST