Pushpa the Rule : పుష్పరాజ్‌... డేట్‌ మార్క్‌ చేసుకోండి...

ABN , First Publish Date - 2023-09-11T16:16:36+05:30 IST

పుష్పరాజ్‌ థియేటర్స్‌లో సందడి చేసే డేట్‌ వచ్చేసింది. అల్లు అర్జున్‌ హీరోగా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచిన ‘పుష్ప’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘పుష్ప-2’ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. వచ్చే ఏడాది ఆగస్ట్‌ 15న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ప్రకటించింది.

Pushpa the Rule : పుష్పరాజ్‌... డేట్‌ మార్క్‌ చేసుకోండి...

పుష్పరాజ్‌ (Pushpa raj) థియేటర్స్‌లో సందడి చేసే డేట్‌ వచ్చేసింది. అల్లు అర్జున్‌ (Allu arjun) హీరోగా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచిన ‘పుష్ప’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘పుష్ప-2’(Pushpa -2) చిత్రం విడుదల తేదీ ఖరారైంది. వచ్చే ఏడాది ఆగస్ట్‌ 15న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు మైతీ సంస్థ ట్వీట్‌ చేసింది. ‘‘డేట్‌ మార్క్‌ చేసుకోండి.. ‘పుష్ప- ది రూల్‌’ వచ్చే ఏడాది ఆగస్ట్‌ 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతుంది. బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టడానికి ‘పుష్పరాజ్‌ మళ్లీ వస్తున్నాడు’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. (pushpa 2 Release date)

Pushpa 2.jpeg

సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ సరసన రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఫవాద్‌ పాజిల్‌, సునీల్‌, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

పుష్ప పార్ట్‌ 1కు గాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్‌ జాతీయ అవార్డుకు ఎంపికైన సంగతి తెల్సిందే!

Updated Date - 2023-09-11T16:22:01+05:30 IST