Allu Arjun: 'పుష్ప 2' ఫోటోస్ వైరల్

ABN , First Publish Date - 2023-04-06T16:33:04+05:30 IST

అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప 2' నుండి కొన్ని ఫోటోస్ విడుదల చేశారు చిత్ర నిర్వాహకులు. ఆది ఇప్పుడు సాంఘీక మాధ్యమం లో వైరల్ అయ్యాయి. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్బంగా విడుదల చేయబోతున్న చిన్న వీడియో ముందు ఈ ఫోటోస్ వైరల్ అవటం ఆసక్తికరం...

Allu Arjun: 'పుష్ప 2' ఫోటోస్ వైరల్

సుకుమార్ (Sukumar) దర్శకత్వం లో అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తున్న 'పుష్ప 2' (Pushpa 2) షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇది 'పుష్ప' (Pushpa) మొదటి పార్టుకు సీక్వెల్ గా వస్తోంది. మొదటి పార్టులో 'తగ్గేదే లే' (Thaggede Le) అన్న అల్లు అర్జున్, రెండో పార్టులో సుకుమార్ అతన్ని ఇంకా పెద్దగా చూపించబోతున్నట్టు ఒక టాక్ నడుస్తోంది. అయితే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అంటే ఏప్రిల్ 8 (AlluArjunBirthday) న ఆ సినిమా నుండి అల్లు అభిమానులు ఆ సినిమా నుంచి ఏదైనా టీజర్ లాంటిది వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.

pushpa2sukumar.jpg

దానికన్నా ముందు 'వేర్ ఈజ్ పుష్ప' (Where is Pushpa) అన్న వీడియో అయితే వైరల్ అయింది. తిరుపతి జైలు నుండి తప్పించుకున్న పుష్ప ఎక్కడున్నాడు అన్న చిన్న వీడియో ముందుగా విడుదల చేశారు ఆ చిత్ర నిర్వాహకులు. అది బాగా వైరల్ అయినా సంగతి తెలిసిందే. ఇప్పుడు చిత్ర నిర్వాహకులు కొన్ని ఫోటోస్ కూడా విడుదల చేశారు.

pushpa2sukumar1.jpg

ఈ ఫోటోస్ లో దర్శకుడు సుకుమార్, ఈమధ్యనే ఆస్కార్ గెలుచుకున్న లిరిక్ రైటర్ చంద్రబోస్ (Chandrabose) తో, అలాగే మళయాళం నటుడు ఫహాద్ ఫాసిల్ (Fahadh Faassil) తో ఎదో విషయం అయి చర్చిస్తున్నట్టు కనపడుతోంది.

pushpa2sukumar2.jpg

అందులో రేపు సాయంత్రం 4.05 నిముషాలకి పుష్ప ఎక్కడున్నాడు అన్నది తెలుస్తుంది అన్నట్టుగా ఈ ఫోటోస్ తో పాటు పెట్టారు. ఈ ఫోటోస్ అన్నీ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ 'పుష్ప 2' లో అల్లు అర్జున్ వాడే ఊత పదం రేపు విడుదల చేస్తారా అనే ఆసక్తికరం అభిమానుల్లో వుంది.

pushpa2sukumar3.jpg

Updated Date - 2023-04-06T16:33:05+05:30 IST