Pushpa 2: ఇండియన్ సినిమా హిస్టరీలో పెద్ద రికార్డుగా చెబుతున్నారు
ABN , First Publish Date - 2023-06-06T12:34:49+05:30 IST
'పుష్ప’ (Pushpa) చిత్రం సాధించిన విజయంతో ‘పుష్ప-2’పై (Pushpa 2) భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలను మించేలా అవుట్‌పుట్ ఇవ్వడానికి సుకుమార్ కృషి చేస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. డిసెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రంపై రికార్డులు వేట మొదలైపోయింది. ఆడియో రైట్స్ విషయంలో పుష్ప 2 సరికొత్త రికార్డ్ సృష్టించింది.

'పుష్ప’ (Pushpa) చిత్రం సాధించిన విజయంతో ‘పుష్ప-2’పై (Pushpa 2) భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలను మించేలా అవుట్‌పుట్ ఇవ్వడానికి సుకుమార్ కృషి చేస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. డిసెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రంపై రికార్డులు వేట మొదలైపోయింది. ఆడియో రైట్స్ విషయంలో పుష్ప 2 సరికొత్త రికార్డ్ సృష్టించింది. పుష్ప సినిమా సక్సెస్ ఆడియో ఎంత పాత్ర వహించిందో తెలిసిందే! ఇప్పుడు ‘పుష్ప 2’ ఆడియో రైట్స్ రికార్డు ధరకు అమ్ముడుపోయాయి. టీ సిరీస్ సంస్థ అన్ని భాషల ఆడియో రైట్స్‌ను దాదాపుగా తీసుకున్నట్లు సమాచారం. సుమారు రూ.65 కోట్లకు (65 Crores Audio rights) కొనుగోలకు చేసినట్టు ట్రేడ్ వర్గాల నుంచీ చెబుతున్నాయి. ఇండియన్ సినిమా హిస్టరిలో ఇదే రికార్డ్‌గా చెబుతున్నారు. ప్రపంచ స్థాయిలో విజయం సాధించిన ‘ఆర్.ఆర్.ఆర్’కు. రూ.30 కోట్లే వచ్చాయి. వాటితో కంపేర్ చేస్తే ‘పుష్ప’ రెట్టింపు ధరను సొంతం చేసుకొన్నట్టే.
సుకుమార్- దేవిశ్రీ ప్రసాద్ (DSP) సూపర్‌హిట్ కాంబో. కెరీర్ బిగినింగ్ నుంచి సుకుమార్ చిత్రాలకు డీఎస్‌పీ అదిరిపోయే ఆల్బమ్స్ ఇచ్చాడు. అందుకు ‘పుష్ప’ ఒక ఎగ్జాంపుల్. తెలుగులోనే విడుదలైన అన్ని భాషల్లోనూ సూపర్‌హిట్టే. 'ఆర్‌ఆర్‌ఆర్'లో ‘నాటు నాటు’ పాట మినహాయిస్తే మిగిలిన పాటలు అంతగా రిజిస్టర్ కాలేదు. పుష్పలో ప్రతి పాట భాషా భేదం లేకుండా సంగీత ప్రియుల్ని అలరించాయి. అందుకే ఆడియో రైట్స్ ఈ స్థాయిలో అమ్ముడయ్యాయి. ఆడియో హక్కులే ఈ రేంజ్‌లో వెళ్తే.. థియేటర్, ఓటీటీ హక్కులు ఏ మాత్రం వెళ్తాయో చూడాలి!
అల్లు అర్జున్, రష్మిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో అనసూయ, సునీల్, ఫవాద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో మైతీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు.