OscarAward: రాష్ట్ర ప్రభుత్వాల మీద 30 ఇయర్స్ పృథ్వి సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-04-19T12:38:04+05:30 IST

30 ఇయర్స్ పృథ్వి గా పేరుపొందిన నటుడు పృథ్వి ఈసారి రెండు రాష్ట్ర ప్రభుత్వాల మీద సంచలన వ్యాఖ్యలు చేసి మళ్ళీ వార్తల్లో వున్నాడు. ఇంతకీ అతను దీనిగురించి ఈ వ్యాఖ్యలు చేసాడు అంటే...

OscarAward: రాష్ట్ర ప్రభుత్వాల మీద 30 ఇయర్స్ పృథ్వి సంచలన వ్యాఖ్యలు

30 ఇయర్స్ పృథ్వి (30YearPrudhvi) మరోసారి వార్తల్లో వున్నాడు. ఈసారి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మీద విరుచుకుపడ్డాడు, సంచలన వ్యాఖ్యలు చేసాడు. పృథ్వి ఒక చిన్న సినిమా 'అభిలాష' (Abhilasha) ప్రీ రిలీజ్ వేడుకకు హాజరయ్యాడు, ఆ ఫంక్షన్ లో ఈ కామెంట్స్ చేసాడు. ఈమధ్యనే ఆస్కార్ అవార్డు (OscarAward) గెలుచుకున్న 'ఆర్ఆర్ఆర్' (RRR) సినిమా సంగీత దర్శకుడు, లిరిక్ రైటర్, పాడినవాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి సన్మానాలు చేయకపోవటం మీద పృథ్వి ఈ వ్యాఖ్యలు చేసాడు.

30yearsprudhvi1.jpg

పృథ్వి ఆ సినిమాకి సంబంధం లేకపోయినా, ఎందుకో సభాముఖంగా చెప్పాలనిపించి చెపుతున్న అని అన్నాడు. "ఎందుకూ పనికిరాని ఒక చిన్న గేమ్ లో గెలిస్తే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్మానాలు చేస్తాయ్, ఎకరాలకు ఎకరాలు భూమిని కూడా ఇచ్చేస్తారు. ఆ తరువాత వాడు ఆడతాడో ఆడడో కూడా తెలీదు. వరంగల్ గడ్డ మీద పుట్టిన చంద్రబోస్(Chandrabose), ఆంధ్ర కి చెందిన రాజమౌళి (Rajamouli), కీరవాణి (Keeravani), రాష్ట్రాలతో, మతాలతో పనిలేకుండా ఒక లాల్ బహదూర్ స్టేడియం లాంటి దానిలో సన్మానం చేస్తే ఎంత బాగుండేది," అని పృథ్వి సంచలన వ్యాఖ్యలు చేసాడు.

rajamouliramacharanntr.jpg

ఒకప్పుడు వరల్డ్ కప్ గెలిస్తే వీధుల్లో తాగి తందానాలు ఆడేవాళ్ళం, కానీ ఇప్పుడు ఒక ఆస్కార్ అవార్డు వస్తే ఏమి చెయ్యటం లేదు అనే భావన వ్యక్తం చేసాడు పృథ్వి. "ఆస్కార్ అవార్డు అందుకున్న తెలుగు సినిమా, గ్లోబల్ ప్రైడ్ రాజమౌళి గారు, కీరవాణి, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligang), కాల భైరవ (Kalabhairava), ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ (Ram Charan) ఇంతమంది సమిష్టి కృషి ఇది. ఇండియన్ మార్కెట్ ని గ్లోబల్ కి తీసుకెళ్లిన ఘనత. లాస్ ఏంజెల్స్ లో అడ్రస్ దొరక్కపోతే, ఆస్కార్, ఇండియా అంటే చాలు, మీరు 'ఆర్.ఆర్.ఆర్' యూనిట్ నుంచి వచ్చారా అని అడుగుతారు," అని చెప్పాడు పృథ్వి. అలాంటి వాళ్ళకి ఏమి చెయ్యకుండా, పనికిరాని వాళ్ళకి ఎదో చేస్తాం, భూములిస్తాం అని ప్రభుత్వాలని విమర్శించాడు పృథ్వి.

Updated Date - 2023-04-19T13:04:33+05:30 IST