Project K : Deepika ఆసక్తికర అప్డేట్

ABN , First Publish Date - 2023-01-05T14:23:54+05:30 IST

ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ప్యాన్‌ ఇండియా చిత్రం ‘పాజెక్ట్‌ కె’. ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ర్టీలోనే భారీ బడ్జెట్‌తో వైజయంతీ సంస్థ నిర్మిస్తోన్న చిత్రమిది. ఇందులో కథానాయికగా దీపికా పడుకోన్‌ నటిస్తున్నారు.

Project K : Deepika ఆసక్తికర అప్డేట్

ప్రభాస్‌ (Prabhas)హీరోగా నాగ్‌ అశ్విన్‌(Nag aswin) దర్శకత్వం వహిస్తున్న ప్యాన్‌ ఇండియా చిత్రం ‘పాజెక్ట్‌ కె’. ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ర్టీలోనే భారీ బడ్జెట్‌తో వైజయంతీ సంస్థ నిర్మిస్తోన్న చిత్రమిది. ఇందులో కథానాయికగా దీపికా పడుకోన్‌ (deepika padunoneనటిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో కనిపిస్తారు. గురువారం దీపిక పుట్టినరోజు సందర్భంగా కొత్త లుక్‌ను విడుదల చేశారు. దానిపై ‘ఎ హోప్‌ ఇన్‌ ద డార్క్‌’ (‘A Hope in the Dark) అని రాశారు. షార్ట్ట్‌ హెయిర్‌తో, సిల్లౌట్‌ పోస్టర్‌లో ఉన్న దీపిక లుక్‌ హాలీవుడ్‌ స్థాయిలో ఉంది. క్యాప్షన్స్‌ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. అయితే దర్శకుడు ఇప్పటి వరకూ విడుదల చేసిన లుక్స్‌ చూస్తుంటే ఏ జానర్‌ సినిమా అనేది ప్రేక్షకులకు అర్ధం కావడం లేదని నెట్టింట వైరల్‌ అవుతోంది.

Updated Date - 2023-01-05T14:24:08+05:30 IST