Project K - San Diego: కామిక్‌- కాన్‌లో ఏం చేస్తున్నారంటే.. ఏ సినిమాకూ దక్కని గౌరవమిది

ABN , First Publish Date - 2023-07-07T10:50:42+05:30 IST

‘సలార్‌‘ (salaar)టీజర్‌ సందడిలో మంచి జోరుగా ఉన్నారు ప్రభాస్‌ అభిమానులు. ఈ తరుణంలోనే ‘ప్రాజెక్ట్‌-కె’(Project k)కు సంబంధించి తాజా అప్‌డేట్‌ ఇచ్చి ఆ ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్‌ ఓ రేంజ్‌లో ఆకట్టుకున్నాయి. సినిమా టైటిల్‌తోపాటు గ్లింప్స్‌ను ఈ నెల 20న అబ్రాడ్‌లో విడుదల చేయనున్నారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. అదే నిజం చేస్తూ నిర్మాణ సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

Project K - San Diego: కామిక్‌- కాన్‌లో ఏం చేస్తున్నారంటే.. ఏ సినిమాకూ దక్కని  గౌరవమిది

‘సలార్‌‘ (salaar)టీజర్‌ సందడిలో మంచి జోరుగా ఉన్నారు ప్రభాస్‌ అభిమానులు. ఈ తరుణంలోనే ‘ప్రాజెక్ట్‌-కె’(Project k)కు సంబంధించి తాజా అప్‌డేట్‌ ఇచ్చి ఆ ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్‌ ఓ రేంజ్‌లో ఆకట్టుకున్నాయి. సినిమా టైటిల్‌తోపాటు గ్లింప్స్‌ను ఈ నెల 20న అబ్రాడ్‌లో విడుదల చేయనున్నారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. అదే నిజం చేస్తూ నిర్మాణ సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. అమెరికాలో జరిగే శాన్‌ డియాగో కామిక్‌-కాన్‌ వేడుకలో ‘ప్రాజెక్ట్‌-కె’ ఫస్ట్‌ గ్లింప్స్‌తో పాటు టైటిల్‌ను రివీల్‌ చేయడమే కాకుండా రిలీజ్‌ డేట్‌ను కూడా ప్రకటించనున్నారు. ఈ విషయాన్ని వైజయంతీ సంస్థ ట్విట్టర్‌ వేదికగా తెలిపింది. ‘మాకు గర్వించదగ్గ విషయమిది. శాన్‌ డియాగో కామిక్‌-కాన్‌ మేం వస్తున్నాం’’ అని పోస్ట్‌ చేశారు. అమెరికాలో జూలై 19 నుంచి కామిక్‌- కాన్‌ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ప్రభాస్‌( kamal Haasan), కమల్‌హాసన్‌9Kamal Haasan), అమితాబ్‌, దీపికా, నాగ్‌ అశ్విన్‌ తదితరులు పాల్గొనున్నారు. కాగా 20న జరిగే వేడుకలో టైటిల్‌ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నారు. ఇప్పటివరకు తెలుగులో ఏ సినిమాకు ఇలాంటి గౌరవం దక్కలేదు. ఈ విషయం బయటకు రాగానే ప్రభాస్‌ ఫ్యాన్‌ ఆనందానికి అవధులు లేవు. టాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ వరకు మా డార్లింగ్‌ క్రేజ్‌ పయనమవుతోంది అంటూ సందడి చేస్తున్నారు. (San Diego @Comic Con)

నాగ్‌ అశ్విన్‌ (Nag aswin) దర్శకత్వంలో ప్రభాస్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ చిత్రమిది. దీతపికా పడుకోన్‌ కథానాయిక. అమితాబ్‌, కమల్‌ హాసన్‌ కీలక పాత్రల్లో కనిపిస్తారు. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Updated Date - 2023-07-07T11:45:14+05:30 IST