సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Dil Raju: ‘మెకానిక్’ టీమ్‌ను ఖుషి చేసిన దిల్ రాజు

ABN, First Publish Date - 2023-02-21T19:55:59+05:30

ఎంతో బిజీ షెడ్యూల్‌లో ఉండి కూడా... తన విలువైన సమయాన్ని కేటాయించి... మా చిత్ర మోషన్ పోస్టర్‌ను విడుదల చేసిన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మణి సాయితేజ (Mani Saiteja) టైటిల్ రోల్ ప్లే చేస్తున్న చిత్రం ‘మెకానిక్’ (Mechanic). ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను తాజాగా సక్సెస్‌ఫుల్ చిత్రాల నిర్మాత దిల్ రాజు విడుదల చేసి.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. టీనా శ్రీ క్రియేషన్స్ (Teena Sree Creations) పతాకంపై నిర్మాత మున్నా (ఎమ్. నాగ మునెయ్య) (Munna).. సహ నిర్మాతలైన కొండ్రాసి ఉపేందర్, నందిపాటి శ్రీధర్ రెడ్డిలతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కంప్లీట్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో గ్రామీణ నేపథ్యంలో.. నేటి సమాజంలోని ఒక బర్నింగ్ ప్రాబ్లమ్ నేపథ్యంలో ఎంటర్‌టైన్‌మెంట్‌కి పెద్ద పీట వేస్తూ సందేశాత్మక చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంతో దర్శకుడు కృష్ణవంశీ దగ్గర అసోసియేట్‌గా పనిచేసిన ముని సహేకర (Muni Sahekara) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘ట్రబుల్ షూటర్’ (Trouble Shooter) అనేది చిత్ర ట్యాగ్‌లైన్.

చిత్ర మోషన్ పోస్టర్ విడుదల సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. ఎంతో బిజీ షెడ్యూల్‌లో ఉండి కూడా... తన విలువైన సమయాన్ని కేటాయించి... మా చిత్ర మోషన్ పోస్టర్‌ను విడుదల చేసిన దిల్ రాజుగారికి కృతజ్ఞతలు. ఆయన చేతులు మీదుగా విడుదలవడం చాలా సంతోషంగా ఉంది. గ్రామీణ నేపథ్యంలో.. అందరినీ టచ్ చేసేలా, ఓ మంచి పాయింట్‌తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నామని వారు తెలిపారు. మణిసాయితేజ (Mani Saiteja) సరసన రేఖనిరోషా (Rekha Nirosha) హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రం.. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. తనికెళ్ల భరణి, నాగ మహేష్, సూర్య, ఛత్రపతి శేఖర్, సంధ్యా జనక్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి వినోద్ యాజమాన్య (Vinod Yajamanya) సంగీతం అందిస్తున్నారు. (Mechanic Motion Poster)

ఇవి కూడా చదవండి:

Rajendra Prasad: ఇది సంస్కారవంతమైన కేటగిరీకి చెందిన సినిమా

Premi Viswanath: అరుదైన వ్యాధి.. ‘కార్తీకదీపం’ వంటలక్క కూడా ఆ బ్యాచ్‌లోకి!


Updated Date - 2023-02-21T19:56:02+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!