PoliticalSatire: వైసీపీపై అశ్వినీదత్ సెటైర్లు... ఉత్తమ గూండా అవార్డులు ఇస్తున్నారంటూ చురకలు

ABN , First Publish Date - 2023-05-01T11:53:53+05:30 IST

కృష్ణ నటించి, నిర్మించిన 'మోసగాళ్లకు మోసగాడు' సినిమా కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31 న మళ్ళీ విడుదల చేస్తున్న. అయితే ఈ మీడియా సమావేశంలో అగ్ర నిర్మాత అశ్విని దత్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మీద సంచలన కామెంట్స్ చేశారు.

PoliticalSatire: వైసీపీపై అశ్వినీదత్ సెటైర్లు... ఉత్తమ గూండా అవార్డులు ఇస్తున్నారంటూ చురకలు

సూపర్ స్టార్ కృష్ణ (SuperStarKrishna) గారి సినిమా 'మోసగాళ్లకు మోసగాడు' (MosagallakuMosagadu) ఈ మే 31న మళ్ళీ విడుదల చేస్తున్నారు. ఈ సినిమా సుమారు 52 సంవత్సరాల క్రితం తీశారు. ఇది ఇండియాలో మొదటి కౌబాయ్ సినిమా. దీనికి సంబంధించి ఈరోజు ఈ చిత్ర నిర్మాత, కృష్ణ గారి తమ్ముడు ఆదిశేషగిరి రావు ఒక మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాత అశ్విని దత్, దర్శకుడు బి. గోపాల్, ఆదిశేషగిరి రావు లు వచ్చారు.

కృష్ణ గారి పద్మయాలయ బ్యానర్ నిలబడటానికి ఈ 'మోసగాళ్లకు మోసగాడు' సినిమా ఎంతో ఉపయోగపడిని అని, ఈ సినిమా మాకు ఒక ప్రతిష్ఠాత్మక చిత్రం అని, అభిమానుల కోరిక మేరకు ఈ సినిమాని మే 31, కృష్ణగారి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేస్తున్నామని చెప్పాడు ఆదిశేషగిరి రావు. ఇప్పటి అభిరుచుకి తగ్గట్టుగా ఈ సినిమాకి అన్ని హంగులు సమకూర్చి 4కె లో విడుదల చేస్తున్నారు చెప్పారు.

adiseshagirirao.jpg

ఇదే సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలు నంది అవార్డులు ఇవ్వటం మానేశారు కదా, మీరు ఏమైనా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి అవార్డులు ఇప్పిస్తారా అన్న ప్రశ్నకి అది ప్రభుత్వాలు చూడాలన్నారు. అయినా ఇప్పుడు వాళ్ళిచ్చే అవార్డులకు కూడా అంత విలువ లేదన్నట్టుగా చెప్పారు. #AswhiniDutt

అంతలోనే అశ్విని దత్, మైక్ అందుకొని "ఇప్పుడు ఉత్తమ రౌడీ, ఉత్తమ గూండా అవార్డులు ఇస్తున్నారు. ఇంకా రెండు మూడేళ్ళలో మళ్ళీ అవార్డులు అన్నీ సక్రమంగా వస్తాయి," అని చెప్పారు. అశ్విని దత్ తెలుగు దేశం పార్టీ కి #TeluduDesamParty మొదటి నుండి సపోర్ట్ చేస్తూ వచ్చారు, #YSRCP అందుకని పరీక్షంగా ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో రౌడీ పాలన, #YSJagan గూండా పాలన నడుస్తోందని చెప్పారు. అలాగే రానున్న ఎన్నికల్లో తెలుగు దేశం వస్తుందని పరోక్షంగా కూడా అశ్విని దత్ చెప్పారు. ఇప్పుడు అతని మాటలు ఎలా తీసుకుంటారో చూడాలి.

Updated Date - 2023-05-01T11:54:42+05:30 IST