Pawan kalyan (OG): ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌కి హీరోయిన్‌ దొరికింది!

ABN, First Publish Date - 2023-04-11T14:19:48+05:30

హీరోయిన్‌ ప్రియాంక ఆరుళ్‌ మోహన్‌కు టాలీవుడ్‌లో భారీ అఫర్‌ దక్కిందనే వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. నాని ‘గ్యాంగ్‌లీడర్‌’, ‘శ్రీకారం చిత్రాలలో తన నటనతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించారు ప్రియాంక.

Pawan kalyan (OG): ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌కి హీరోయిన్‌ దొరికింది!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హీరోయిన్‌ ప్రియాంక ఆరుళ్‌ మోహన్‌(Priyanka arul mohan) కు టాలీవుడ్‌లో భారీ అఫర్‌ దక్కిందనే వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. నాని ‘గ్యాంగ్‌లీడర్‌’, ‘శ్రీకారం చిత్రాలలో తన నటనతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించారు ప్రియాంక (Big offer for Priyanka) . అయితే ఈ రెండు చిత్రాలు అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు. ఆ తర్వాత ఆమెకు సరైన అవకాశమూ రాలేదు. ఇప్పుడు జాక్‌పాట్‌ కొట్టినట్లు ఓ పెద్ద ఆఫర్‌ ఆమె చేతిలో పడినట్లు తెలిసింది. పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan) హీరోగా సుజీత్‌ (Sujeeth) దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌’ (OG) అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ చిత్రాన్ని మొదలుపెట్టారు, ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan) సరనసన నటించేందుకు కథానాయక దొరికిందనే వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఒజి చిత్రం కోసం కథానాయికగా ప్రియాంకను దర్శకుడు సుజీత్‌ ఎంపిక చేశారట. టాలీవుడ్‌లో ఆమెకు దక్కిన పెద్ద అవకాశమిది. ఇప్పటి వరకూ ఆమె నటించిన తెలుగు, తమిళ చిత్రాల్లో ఎక్కువగా పక్కింటి అమ్మాయి పాత్రల్లోనే కనిపించారు. ‘గ్యాంగ్‌స్టర్‌’ కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియాంక పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలి.

Untitled-1.jpg

పవన్‌కల్యాణ్‌ హీరోగా, సుజీత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి డి.వి.వి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ వారంలో ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలువుతుందని చిత్ర బృందం నుంచి సమాచారం. ప్రస్తుతం పవన్‌కల్యాణ్‌ హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ (Ustaad bhagath singh) చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. మరోవైపు సముద్రఖని దర్శకత్వంలో ‘వినోదాయ సీతం’ రీమేక్‌లో నటిస్తున్నారు. ఇందులో సాయిధరమ్‌ తేజ్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Updated Date - 2023-04-11T14:30:03+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!