Bhama kalapam 2: రెడీ అవుతున్న‌.. ప్రియ‌మ‌ణి డార్క్ కామెడీ థ్రిల్ల‌ర్ ‘భామా క‌లాపం2’.. ఈసారి మరింతగా

ABN , First Publish Date - 2023-11-23T11:55:35+05:30 IST

ప్రియ‌మ‌ణి ప్ర‌ధాన పాత్ర‌లో 2022 ఫిభ్ర‌వ‌రిలో వ‌చ్చిన చిత్రం భామా క‌లాపం. థ్రిల్ల‌ర్‌, డార్క్ కామెడీగా వ‌చ్చిన ఈ సినిమా ఆహ ఓటీటీలో విడుద‌ల‌వ‌గా మంచి ఆద‌ర‌ణ‌నే తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా భామా క‌లాపం2ను మేక‌ర్స్ సిద్ధం చేస్తున్నారు.

Bhama kalapam 2: రెడీ అవుతున్న‌.. ప్రియ‌మ‌ణి డార్క్ కామెడీ థ్రిల్ల‌ర్ ‘భామా క‌లాపం2’.. ఈసారి మరింతగా
priyamani

ప్రియ‌మ‌ణి (Priyamani) ప్ర‌ధాన పాత్ర‌లో 2022 ఫిభ్ర‌వ‌రిలో వ‌చ్చిన చిత్రం భామా క‌లాపం (Bhama kalapam2). థ్రిల్ల‌ర్‌, డార్క్ కామెడీగా వ‌చ్చిన ఈ సినిమా ఆహ ఓటీటీలో విడుద‌ల‌వ‌గా మంచి ఆద‌ర‌ణ‌నే తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా భామా క‌లాపం2ను మేక‌ర్స్ సిద్ధం చేస్తున్నారు. షూటింగ్ పూర్త‌యిన ఈ చిత్రాన్ని ఈ సారి ఓటీటీలోకి తేకుండా నేరుగా థియేట‌ర్లలో విడుద‌ల చేయ‌నున్నారు.

మొద‌టి పార్ట్‌లో క‌థంతా ప్రియ‌మ‌ణి (Priyamani ) చుట్టూ తిరిగిన‌ట్టుగానే రెండో పార్టులోను ఆమె కేంద్రంగానే సినిమా న‌డ‌వనుంది. కానీ ఈ సారి అంత‌కుమించి అనేలా బ్యాంకు దోపిడీ, ఆగంత‌కుల నేప‌థ్యంలో ఈ చిత్రం ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈమేర‌కు తాజాగా విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ఇంట్రెస్టింగ్‌గా ఉండి. నెటిజన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నది. మొద‌టి బాగాన్ని డైరెక్ట్ చేసిన అభిమ‌న్యూ (abhimanyu tadimeti)నే ఈ రెండో భాగానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. సీర‌త్ క‌పూర్ (Seerat Kapoor), బ్ర‌హ్మాజీ (Brahmaji) ప్ర‌ధాన పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు.


ఇక ఈ సినిమా మొద‌టి భాగంలో అనుపమ(ప్రియమణి) ఫేమస్ యూ ట్యూబర్ కం గృహిణి. అంతే కాకుండా ఎల్ల‌ప్పుడూ అవతలి వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో? అని తెలుసుకోవాల‌నే వింత అల‌వాటు ఉంటుంది. ఈ క్ర‌మంలో ఓ రోజు ఒకరి ఇంట్లోకి వెళ్లి ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటుంది. ఆ తర్వాత ఆమె అందులో నుంచి త‌ప్పించుకోవ‌డానికి చేసిన ప్ర‌య‌త్నాలు, అందుకు ఎదురైన‌ అనుభ‌వాలు, చివ‌రికి అస‌లు హంత‌కుడి గురించి తెలిసి, ఆ కేసు నుంచి ఎలా త‌ప్పించుక‌న్న‌ద‌నే కోణంలో ఆధ్యంతం థ్రిల్‌కు గురి చేస్తుంది.

Updated Date - 2023-11-23T12:05:32+05:30 IST